26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

పేరుకే ప్రభుత్వ ఉద్యోగి… జీవితమంతా జగన్ సేవ

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గా పనిచేసిన కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్రభుత్వ ఉద్యోగస్తుడు లాగా ఏనాడు ప్రవర్తించలేదు. ఉద్యోగం లో ఉన్నా వైసీపీ నాయకుడు గానే ఉన్నాడు.

మాజీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డి, వైసీపీకి చేస్తున్న ఊడిగం అంతా ఇంతా కాదు. ఒక ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా, వైసీపీ పార్టీకి ముఖ్య నాయకుడిగా అతని ప్రవర్తన ఉంటుంది అనటంలో సందేహమే లేదు. వైసీపీ రాజకీయ అజెండా బహిరంగంగా మోస్తూ, బరి తెగించాడు. జగన్ సీయంగా ఉండగా అమరావతి విషయంలో, ఉద్యోగులు మొత్తానికి తరుపున, నేనే అన్నట్టు మాట్లాడుతూ, వైసీపీ అజెండాను ఉద్యోగుల పై రుద్దాడు.

జగన్ ఉండగా ఉద్యోగులు ఎదుర్కుంటున్న సమస్యల పై కాకర్ల వెంకట్రామిరెడ్డి ఏ రోజు నోరు తెరవలేదు. సెక్రటేరియట్ లో ఉద్యోగి ముసుగులో కూటమి ప్రభుత్వం పై విషం చిమ్మాడు.

ఇంతకీ వైసీపీ పార్టీకి, కాకర్ల వెంకట్రామిరెడ్డికి ఉన్న బంధం ఏమిటో తెలుసా ?

కాకర్ల వెంకట్రామిరెడ్డి పక్కా వైసీపీ కార్యకర్త. కాకర్ల వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, 2012 నుంచి ముషీరాబాద్ నియోజకవర్గంలో వైసీపీ తరుపున పని చేసారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో 2014లో ఎమ్మెల్యే టికెట్ కూడా జగన్ ఇచ్చారు. కానీ నామినేషన్ సమయానికి, కాకర్ల వెంకట్రామిరెడ్డి సర్వీస్ లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అని ప్రతిపక్షాలు బయటపెట్టటంతో, నామినేషన్ వెయ్యటానికి వీలు పడలేదు. దీంతో వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి, వైసీపీ తరుపున ప్రచారం మాత్రం చేసి, ఊరుకున్నారు.

2014 ఎన్నికల్లో చంద్రబాబుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు కాకర్ల వెంకట్రామిరెడ్డి. ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ, చంద్రబాబుని ఓడించి, జగన్ ని గెలిపించాలని బహిరంగంగా చెప్పాడు. తరువాత చంద్రబాబు అధికారంలోకి రావటంతో, 2013 డిసెంబర్ నుంచి 2015 వరకు పెట్టిన పోస్టులు అన్నీ డిలీట్ చేసారు. తరువాత కూడా 2016లో ఉద్యోగులు హైదరాబాద్ నుంచి అమరావతి వస్తున్న తరుణంలో, వారిని రెచ్చగొట్టే బాధ్యత, వైసిపీ నుంచి తీసుకున్నాడు.

2015లో జగన్ ని కలిసిన ఫోటోలు, ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి. కలిసిన తరువాత, వైసీపీ అజెండా అమలు చేసి, ఉద్యోగులు మధ్య వైరం తెచ్చే ప్రయత్నం చేసాడు. జగన్ చేసిన పాదయాత్రలో, వెంకట్రామిరెడ్డి భార్య, శ్వేతా వెంకటరామి రెడ్డి కూడా పాల్గున్నారు. ఇక 2019 మార్చ్ నుంచి, ఎన్నికలు అయ్యే వరకు చంద్రబాబుని ఓడించాలి అంటూ, ఉద్యోగ చైతన్య యాత్ర పేరిట, అన్ని ఆఫీసులు తిరిగాడు.

దానికి ప్రతి ఫలంగా, జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, కాకర్ల వెంకట్రామిరెడ్డికి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష పదవి 40 ఏళ్ళ వయసులోనే వచ్చింది అంటే, వీళ్ళ స్కెచ్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

జగన్ రాగానే ఉద్యోగులకు నరకం చూపించినా నోరు తెరవలేదు.. జగన్ కోసం 2024 ఎన్నికల్లో డైరెక్ట్ గా పని చేసాడు. నేను జగన్ బంటుని అని బహిరంగంగా చెప్పుకుని తిరిగాడు. కూటమి అధికారంలోకి రాగానే, మళ్ళీ కుట్రలు మొదలు పెట్టాడు. ప్రభుత్వ అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా వెంకట్రామిరెడ్డి వేస్తున్న వేషాలను, ఆధారాలతో, ప్రొసీజర్ ప్రకారం పెట్టి, అతన్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసింది ప్రభుత్వం.. వైసీపీ బాధకు కారణం ఇదన్నమాట..

Related posts

మత్స్యావతారంలో కనువిందు చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

Satyam News

2025 కేలండర్‌ లో సగం కాలం విమానంలోనే…

Satyam News

దీపావళి ప్రజలందరూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

Satyam News

ఐదేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం

Satyam News

మహిళల ఆభివృద్ధి దేశానికి పునాది

Satyam News

లెబనాన్ పై మళ్లీ దాడి చేసిన ఇజ్రాయెల్

Satyam News

Leave a Comment