26.3 C
Hyderabad
September 19, 2026
జాతీయంహోమ్

ఆ న్యాయమూర్తి ఎదుటకు నేను కూడా వెళ్లను

#ManishSisodia

ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ స్వర్ణ కాంత శర్మ న్యాయస్థానంలో కొనసాగించేందుకు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కూడా విముఖత వ్యక్తం చేశారు. తన కేసును ఇకపై ఆమె కోర్టులో కొనసాగించబోనని స్పష్టం చేశారు. ఇప్పటికే ఇలాంటి నిర్ణయమే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న విషయం తెలిసిందే.

సిసోడియా తన లేఖలో ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం లభిస్తుందన్న నమ్మకం కోల్పోయినట్లు పేర్కొన్నారు. “ఈ పరిస్థితుల్లో న్యాయం జరుగుతుందని ఆశించడం లేదు” అని స్పష్టంగా రాసిన ఆయన, న్యాయ ప్రక్రియపై తీవ్ర అనుమానాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా దేశ అటార్నీ జనరల్ తుషార్ మెహతాపై పరోక్ష విమర్శలు చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చకు దారి తీసే అవకాశముంది.

తన తరఫున ఎలాంటి న్యాయవాదిని కూడా నియమించబోనని సిసోడియా ప్రకటించారు. ఇకపై తన పోరాట మార్గం గాంధీ సిద్ధాంతాలైన సత్యాగ్రహమేనని పేర్కొంటూ, శాంతియుత నిరసన దిశగా వెళ్లబోతున్నట్లు తెలిపారు.

ఇదే నేపథ్యంలో ఒక రోజు ముందు కేజ్రీవాల్ కూడా అదే న్యాయమూర్తి ఎదుట విచారణలో పాల్గొనబోనని, వ్యక్తిగతంగా గానీ, న్యాయవాది ద్వారా గానీ హాజరు కాబోనని వెల్లడించారు. ఏప్రిల్ 20న ఢిల్లీ హైకోర్టు, జస్టిస్ శర్మను ఈ కేసు నుంచి తప్పించాలని కోరిన కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థపై చర్చను మళ్లీ ముందుకు తెచ్చే అవకాశముంది. ఇకపై ఈ కేసు దిశ ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

పల్నాడు ఎస్పీ చర్యలకు నిరసనగా ఎమ్మెల్యే ధర్నా

Satyam News

నెయ్యి ట్యాంకర్ బోల్తా: ప్రమాదమా? కుట్రా?

Satyam News

వారంలో ఒక రోజు నో వెహికల్ డే

Satyam News

తెలంగాణ వెలుగులకు సింగరేణి భరోసా

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

రెండు టవర్లకే స్టాలిన్‌పై ప్రశంసలు…. మరి ఏపీ చూస్తే.!!

Satyam News

Leave a Comment