గుంటూరుహోమ్

రెండు పెట్రోల్ బ్యాంకులను సీజ్ చేసిన కలెక్టర్

పల్నాడు జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా ఇంధన విక్రయాలు జరుపుతున్న రెండు పెట్రోల్ బంకులను జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా సీజ్ చేశారు. నరసరావుపేట పట్టణంలోని శ్రీనిధి ఫిల్లింగ్ స్టేషన్ మరియు పిడుగురాళ్లలోని తిరుమల ఫిల్లింగ్ స్టేషన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించిన అధికారులు, కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే వాటిని మూసివేశారు.

జిల్లాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పెట్రోల్ బంకుల వద్ద రద్దీని అదుపు చేయడానికి మరియు అక్రమ అమ్మకాలను అరికట్టడానికి కలెక్టర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారు.

సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఇంధన సరఫరాలో పారదర్శకత పాటించాలని అధికారులను ఆదేశించిన ఆమె, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ తనిఖీలతో జిల్లాలోని పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితి ప్రస్తుతం అదుపులోకి వచ్చింది.

Related posts

ఎర్రబస్సు రాని ఊరికి.. ఎయిర్‌ బస్ ఎలా వచ్చింది?

Satyam News

సిద్ధరామయ్య రాజీనామా: డీ కే కు ఇక లైన్ క్లియర్

Satyam News

“తల తిరుగుడు” కు అత్యాధునిక వైద్య చికిత్సలు

Satyam News

మాట నిలబెట్టుకున్న లోకేష్‌: పునర్వికకు రూ. 16 కోట్ల ఇంజెక్షన్‌

Satyam News

జగన్ హయాంలో భారీ ‘విద్యుత్’ కుంభకోణం

Satyam News

చర్చలకు మేం సిద్ధం: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ప్రకటన

Satyam News

Leave a Comment