26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్

#NaraLokesh

తెలుగుదేశం పార్టీలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ కు పలువురు నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయంలోని తన చాంబర్ లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి అభినందనలు తెలిపారు.

టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షులుగా నారా లోకేష్ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. అంతకుముందు ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ సమక్షంలో కేక్ కట్ చేశారు. శ్రీకృష్ణదేవరాయలకు కేక్ తినిపించి మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

శ్త్రీ శక్తి డిజిటల్ మహానాడుకు అనంతపురంలో ఘన ఏర్పాట్లు

Satyam News

మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం

Satyam News

రోజు రోజుకూ పెరుగుతున్న ‘తాగుడు’ ఆదాయం

Satyam News

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తాం

Satyam News

శ్రీ దర్బార్ మైసమ్మకు పట్టువస్త్రాల సమర్పణ

Satyam News

వాట్సప్ గవర్నెన్సు ద్వారా ఏపీలో 751 పౌరసేవలు

Satyam News

Leave a Comment