క్రీడలుహోమ్

హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ జట్ల ఖరారు

#IndianRugby

2025లో విజయవంతమైన తొలి సీజన్ తరువాత వచ్చిన ఊపును కొనసాగిస్తూ, జీఎంఆర్ స్పోర్ట్స్, రగ్బీ ఇండియాతో కలిసి ఈ రోజు హైదరాబాద్‌లో సీజన్ 2 ప్లేయర్ వేలం, డ్రాఫ్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. రాబోయే హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ కోసం అన్ని ఫ్రాంచైజీలు బలమైన, పోటీ జట్లను నిర్మించాయి.

భారతీయ రగ్బీ చరిత్రలో ఒక ముఖ్య ఘట్టంగా, మహిళా ఫ్రాంచైజీలు కూడా తొలిసారిగా వేలం, డ్రాఫ్ట్‌లో పాల్గొన్నాయి. ఇందులో చెన్నై బుల్స్, ముంబై డ్రీమర్స్, కోల్‌కతా బంగా టైగర్స్ మరియు ఢిల్లీ రెడ్జ్ తమ ప్రారంభ జట్లను నిర్మించాయి.

పురుషులు, మహిళల పోటీలు రెండూ జూన్ 16 నుండి 28, 2026 వరకు గచ్చిబౌలి స్టేడియం, హైదరాబాద్ లో జరుగనున్నాయి.

పురుషుల విభాగంలో వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుమిత్ కుమార్ రాయ్ రూ. 3.75 లక్షలకు హైదరాబాద్ హీరోస్ లో అత్యధిక ధర పొందిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. ఆయన తరువాత మోహిత్ ఖత్రి రూ. 3.5 లక్షలకు చెన్నై బుల్స్తో చేరగా, దీపక్ కుమార్ పునియా, ప్రశాంత్ అరవింద్ ప్రతాప్ సింగ్ ఇద్దరూ రూ. 2.75 లక్షలకు వరుసగా ఢిల్లీ రెడ్జ్, కోల్‌కతా బంగా టైగర్స్ కు ఎంపికయ్యారు.

మహిళల వేలంలో ఢిల్లీకి చెందిన శిఖా యాదవ్ రూ. 2.4 లక్షలకు ఢిల్లీ రెడ్జ్ లో అత్యధిక ధర పొందిన భారతీయ ఆటగాడిగా నిలిచింది. ఆమె తరువాత భూమిక శుక్లా రూ. 2.2 లక్షలకు ముంబై డ్రీమర్స్ లో చేరగా, నిర్మాల్య రౌత్, అమన్‌దీప్ కౌర్ ఇద్దరూ రూ. 1.6 లక్షలకు వరుసగా కోల్‌కతా బంగా టైగర్స్ మరియు చెన్నై బుల్స్చే ఎంపికయ్యారు.

వేలం అనంతరం రగ్బీ ఇండియా అధ్యక్షుడు రాహుల్ బోస్ మాట్లాడుతూ “ఇది అత్యంత ఉత్సాహభరితమైన వేలం మరియు డ్రాఫ్ట్. ప్రతి జట్టు తమ వ్యూహాలతో అద్భుతంగా సిద్ధమై వచ్చింది. ఇది హెచ్‌ఎస్‌బీసీ ఆర్‌పిఎల్‌ను మరింత పోటీ స్థాయికి తీసుకెళ్తుంది.

2025లో మేము పురుషుల లీగ్‌తో చరిత్ర సృష్టించాము. ఇప్పుడు 2026లో మహిళల లీగ్ కూడా చేరడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహిళల 7s రగ్బీ శక్తివంతమైనది, ఉత్సాహభరితమైనది మరియు అత్యున్నత నైపుణ్యంతో నిండి ఉంటుంది.

భారతదేశం ఇప్పుడు దేశంలోని అత్యుత్తమ మహిళా రగ్బీ ఆటగాళ్లను ప్రపంచ స్థాయి ప్రతిభతో కలిసి చూడబోతోంది. సిద్ధంగా ఉండండి.” అన్నారు. జీఎంఆర్ స్పోర్ట్స్ సిఎంఓ సుజోయ్ గంగూలీ మాట్లాడుతూ “మహిళల లీగ్ ప్రారంభం హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్‌కు ఒక చారిత్రాత్మక మైలురాయి.

నేటి డ్రాఫ్ట్ మహిళా జట్ల నిర్మాణం మరియు వాటిలో పెట్టుబడులకు ఫ్రాంచైజీలు మరియు జీఎంఆర్ స్పోర్ట్స్ బలమైన నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇది భారతీయ రగ్బీలో దీర్ఘకాలిక అభివృద్ధికి, క్రీడాకారిణులకు అవకాశాల సృష్టికి కీలకం.” అన్నారు. ఇప్పుడు జట్లు ఖరారైన నేపథ్యంలో, అన్ని ఫ్రాంచైజీలు ప్రీ-సీజన్ సన్నాహకాలపై దృష్టి సారించనున్నాయి.

Related posts

ప్లాస్లిక్ భూతాన్ని తరిమి… భవితరాలకు ఆరోగ్యానిద్దాం

Satyam News

విద్యా సంఘాల పేరుతో దౌర్జన్యం వద్దు

Satyam News

రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత చంద్రబాబుదే

Satyam News

ఢిల్లీ బస్సులో మహిళపై అత్యాచారం

Satyam News

మంథనిలో న్యాక్ స్కిల్ డెవలెప్ మెంట్ సెంటర్

Satyam News

సింగపూర్ తో ఏపీ భాగస్వామ్యం బలోపేతంపై చర్చ

Satyam News

Leave a Comment