26.3 C
Hyderabad
September 19, 2026
ఆధ్యాత్మికంహోమ్

వైభవంగా ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు గురువారం వైభ‌వంగా ప్రారంభమయ్యాయి. మే 1న ఉదయం ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నులపండువగా జరుగనుంది.

వసంత ఋతువులో మేషరాశిలో సూర్యుడు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు. సూర్యకిరణాల వేడి వల్ల జీవులకు వ్యాధి బాధలు కలుగుతాయి. శ్రీ పద్మావతి అమ్మవారిని వసంతోత్సవాల ద్వారా ఆరాధించడం వల్ల భక్తులకు శారీరక, మానసిక శాంతి లభిస్తుందని విశ్వాసం.

వైభవంగా స్నపనతిరుమంజనం

వసంతోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. 2.30 గంటల నుండి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

శేషాచలాన్ని తలపించిన శుక్ర‌వార‌పుతోట‌

టిటిడి ఉద్యాన‌వ‌న విభాగం డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో శుక్ర‌వార‌పు తోట‌లో శేషాచ‌లం అడవిని త‌ల‌పించేలా తీర్చిదిద్దారు. పచ్చని చెట్లు, పుష్పాలు, జంతువుల ఆకృతులు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఆవు, దూడ, కోతి, నెమలి, హంసలు, చిలుకలు వంటి రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇందులో 300 కేజిల వ‌ట్టి వేరు, 500 కేజిల సాంప్ర‌దాయ పుష్పాలు, 15 వేల క‌ట్ ఫ్ల‌వ‌ర్స్‌తో వివిధ ర‌కాల ఫలాలు వినియోగించారు. ఇందులో బెంగళూరు, హైద‌రాబాద్‌కు చెందిన అలంకరణ నిపుణులు, టిటిడి సిబ్బంది ఇందుకోసం పనిచేశారు.

ఈ సంద‌ర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు స‌భ్యులు ప‌న‌బాక ల‌క్ష్మీ, ఆలయ డెప్యూటీ ఈవో హ‌రీంద్ర‌నాథ్‌, ఏఈవో దేవ‌రాజులు, అర్చకులు బాబుస్వామి, సూప‌రింటెండెంట్లు ముని చెంగ‌ల్రాయులు, ర‌మేష్‌, సురేష్, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ చ‌ల‌ప‌తి, విశేష‌సంఖ్య‌లో భ‌క్తులు పాల్గొన్నారు.

Related posts

అంబేద్కర్ భవనం నిర్మాణం కోసం నవతరం పార్టీ కృషి

Satyam News

క్వాంటం టెక్నాలజీకి అమరావతి లాంచ్ పాడ్

Satyam News

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ నిధులపై ఈడీ దర్యాప్తు

Satyam News

జగన్‌ మరో మూడు ముక్కలాట..??

Satyam News

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

Satyam News

దానాలకు శ్రేష్ఠం సంక్రాంతి పండుగ రోజు

Satyam News

Leave a Comment