24.4 C
Hyderabad
September 21, 2026
ముఖ్యంశాలుహోమ్

పశ్చిమబెంగాల్ లో మసీదుల్లో మైకులు బంద్

#SuvenduAdhikari

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందూ అధికారి శాంతి భద్రతల పర్యవేక్షణపై నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. బంగ్లాదేశ్ సరిహద్దులలో నిఘా తీవ్ర తరం చేయడంతో బాటు చొరబాటుదారులను తక్షణమే గుర్తించి చర్యలు తీసుకునే విధంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సువేందూ అధికారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసపై కూడా విచారణకు ఆదేశించారు. అదే విధంగా రాష్ట్రంలో అనధికార వధ శాలలను కూడా తక్షణమే మూసివేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.

మసీదులు సహా అన్ని మత ప్రార్థనా స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ధ్వని కాలుష్యాన్ని నియంత్రించడం, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నది.

ఆలయాలు, మసీదులు సహా అన్ని మత ప్రార్థనా స్థలాల్లో అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినిపించకూడదని, శబ్దం ప్రార్థనా స్థలాల పరిధి దాటి బయటకు వెళ్లకూడదని పోలీసులకు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా ప్రార్థనలు, మతపరమైన కార్యక్రమాల పేరుతో రహదారులు దిగ్బంధం చేయకూడదని కూడా ప్రభుత్వం స్పష్టం చేశారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అనుమతులు ఉండవచ్చని పేర్కొన్నారు.

Related posts

నేటి అర్ధరాత్రి నుండి అమల్లోకి రానున్న కొత్త జీఎస్టీ

Satyam News

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

Satyam News

వైద్య సామాగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

గాదె ఇన్నయ్య అరెస్టు అన్యాయం

Satyam News

ఇలాంటి కొడుకు ఎవరికీ ఉండకూడదు….

Satyam News

Leave a Comment