మహబూబ్ నగర్హోమ్

పిహెచ్ సి లలో బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొఫైల్

#Narayanapet

నారాయణ పేట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పై జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక  సమీక్ష నిర్వహించారు. సమీక్షలో  జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఒక అర్బన్ హెల్త్ సెంటర్, 27 సబ్ సెంటర్లు,59 పల్లె దవాఖానా ల  పనితీరు పై  చర్చించారు.

అలాగే ఎన్ సి హెచ్ సర్వీస్, చైల్డ్ ఇమ్యునైజేషన్, టి బి ప్రోగ్రామ్  ఎన్ సి డి, ఎన్ ఎల్ ఈ పి ప్రోగ్రామ్ నివేదికల గురించి సంబంధిత విభాగాల అధికారులు వివరించారు. వీటిలో పాటు  ఈ డిడి , ప్రభుత్వ ఆసుపత్రి లలో జనన మరణాల సంఖ్య, ఆరోగ్య మహిళా ప్రోగ్రామ్, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ తదితర వాటి పై  చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..  కేవలం నివేదికలు కాకుండా ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో పూర్తి విశ్వాసం, భరోసా కలిగేలా సేవలు అందించాలన్నారు.

మహిళల ఆరోగ్యం కోసం  బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్  సూచించారు.  మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి పరీక్ష నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఎస్ హెచ్ జి గ్రూపుల సభ్యుల కు  బ్రెస్ట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. పిహెచ్ సీ కేంద్రాల మెడికల్ ఆఫీసర్ల దగ్గర మహిళల బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షల ప్రొఫైల్ ఉండాలని స్పష్టం చేశారు.

అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య సంక్షేమ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. టీ హబ్ శాంపిల్స్ మహబూబ్ నగర్ కు పంపిస్తున్నట్లు డిఏఓ కలెక్టర్ కు  తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్  ఆస్పత్రులలో  జరిగిన సాధారణ ప్రసవాలు, సిజరిన్ ప్రసవాల పై  ఆరా తీశారు. ఏఎన్ఎంలు ఎన్ని కేసులు తీసుకువస్తారని ప్రశ్నించారు. క్యాన్సర్ టీబీ పేషెంట్లకు సరైన  వైద్యం అందించాలని ఆదేశించారు. మళ్లీ వచ్చే సమావేశానికి అన్ని వివరాలతో రావాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలో టీ హబ్ ప్రారంభించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ ఓ డాక్టర్ జయ చంద్రమోహన్ మోహన్, డిపివో బిక్షపతి, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో జిల్లా ఎస్పీ సునితకు స్వాగతం

Satyam News

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

Satyam News

Film Update: అల్లూ అర్జున్ ‘రాకా’ పోస్టర్ విడుదల

Satyam News

ఒకప్పుడు శూన్యం… ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

నందిని సిధారెడ్డి కి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

Satyam News

తృటిలో తప్పిన భారీ విమాన ప్రమాదం

Satyam News

Leave a Comment