ప్రపంచంహోమ్

ఆక్రమిత కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాద శిబరాలు?

#LET

లష్కర్ ఏ తొయిబా కు చెందిన సీనియర్ నాయకుడు హఫీజ్ తల్హా సయీద్ ఇటీవల పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ మాజీ ప్రధానమంత్రి, ఆల్ జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిం కాన్ఫరెన్స్ అధ్యక్షుడు సర్దార్ ఆతిక్ అహ్మద్ ఖాన్ తో ఆయన నివాసంలో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశాన్ని పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో కాశ్మీర్ అంశంపై స్థానిక ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి, “స్వాతంత్ర్య పోరాటం” పేరుతో మళ్లీ తన ప్రభావాన్ని పెంచుకునేందుకు లష్కరే తోయిబా చేపడుతున్న కొత్త ప్రయత్నాల భాగంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాన్ని నియామక కేంద్రంగా, కార్యకలాపాల స్థావరంగా మలచుకునేందుకు మదర్సాలు మరియు అనుబంధ సంస్థల నెట్‌వర్క్‌ను విస్తృతంగా ఉపయోగిస్తోంది. భారత ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన “ఆపరేషన్ సిందూర్” తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఆ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాతో సంబంధాలున్న అనేక ఉగ్ర స్థావరాలపై లక్ష్యిత దాడులు జరిగాయి.

భద్రతా నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆ ఆపరేషన్‌తో దెబ్బతిన్న తమ వ్యవస్థను తిరిగి పునర్నిర్మించుకునేందుకు లష్కరే తోయిబా మరియు దాని అనుబంధ సంస్థలు ఇప్పుడు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చురుకుగా కదులుతున్నాయి.

వీరి సమావేశంలో కాశ్మీర్ సమస్యతో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో జరగనున్న ఎన్నికల అంశాలపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Related posts

చంద్రబాబు చొరవ తో ఏపీకి ఈ రూట్‌లో కొత్త రైల్వే లైన్

Satyam News

తీవ్ర రూపం దాల్చిన బోడుప్పల్ వక్ఫ్ భూముల సమస్య

Satyam News

తీవ్రమౌతున్న ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం

Satyam News

ఆదర్శ నియోజకవర్గంగా హుస్నాబాద్‌

Satyam News

దేశ భద్రతలో పుట్టపర్తి ఏరోస్పేస్ క్లస్టర్ ప్రాముఖ్యత ఏమిటి?

Satyam News

ప్రంబనన్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ

Satyam News

Leave a Comment