26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

ఎల్ నినో ప్రభావం తో ఈసారి కష్ట కాలమే

#Rain

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో వస్తాయి కానీ సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా వాతావరణ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న బలమైన ఎల్‌నినో ప్రభావం వల్ల ఈసారి వర్షాలు గణనీయంగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ వర్షాకాలంలో 50 శాతం సాధారణ వర్షాలు, మరో 50 శాతం లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. గత ఐదారు ఏళ్లతో పోలిస్తే ఈసారి వర్షాలు తక్కువగా ఉంటాయని, పరిస్థితి దాదాపు 2018 నాటి వర్షాకాలాన్ని పోలి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అయితే 2014-15 సంవత్సరాల్లో ఎదురైనంత తీవ్రమైన కరవు పరిస్థితులు మాత్రం ఈసారి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత ఏడాది అంటే 2025లో కురిసిన భారీ వర్షాలను ఈసారి ఆశించలేమని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

నెలల వారీగా వర్షాల తీరును గమనిస్తే, రుతుపవనాల ఆగమనం ఎప్పటిలాగే జూన్ రెండవ వారంలో సకాలంలోనే ప్రారంభం కానుంది. జూన్, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాతే అసలు సమస్య మొదలుకానుంది. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వర్షాలు బాగా తగ్గిపోయి, దేశవ్యాప్తంగా లోటు వర్షపాతం ఏర్పడే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు.

ప్రాంతాల వారీగా చూస్తే వర్షాల పంపిణీ తీవ్ర అసమతుల్యంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో భారీగా లోటు వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది కాబట్టి రైతాంగం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈసారి మంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

రాజధాని హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలలో ఈ ఏడాది సాధారణం నుండి స్వల్పంగా లోటు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టడంతో పాటు, రైతులు పంటల ప్రణాళికను జాగ్రత్తగా రూపొందించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Related posts

వనపర్తిలో అవినీతి అధికారి పట్టివేత

Satyam News

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News

భారత దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చిందా?

Satyam News

బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Satyam News

క్రెడిట్ ఎవరిదో… క్రెడిబులిటీ ఎవరికుందో ప్రజలకు తెలుసు

Satyam News

ఏపీ లో తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

Satyam News

Leave a Comment