31.6 C
Hyderabad
September 21, 2026
శ్రీకాకుళంహోమ్

నిలిచిన బీటీ రోడ్డు పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే కలమట

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం రాయల–బంకి గ్రామాలను కలుపుతూ మంజూరైన బీటీ రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోవడంతో మాజీ ఎమ్మెల్యే కలమత్త వేంకటరమణ పనుల ప్రాంతాన్ని పరిశీలించారు. మార్చి నెలలో రాయల చెరువు గట్టుపై ట్రెంచ్ త్రవ్వి పనులు నిలిపివేయడంతో ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆయన తెలిపారు.

చెరువు అంతర్భాగంలో ట్రెంచ్ త్రవ్వడం వల్ల గట్టు బలహీనపడిందని, భారీ వర్షాలు కురిస్తే గండి పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రాయల, మాకవరం, కుద్దిగం, పొన్నుటూరు గ్రామాల పరిధిలోని వందల ఎకరాల పంటలు నష్టపోయే అవకాశం ఉందన్నారు.

పనులు పూర్తి చేయకుండానే బిల్లులు చెల్లించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే చెరువులో త్రవ్విన ట్రెంచ్‌ను వెంటనే పూడ్చివేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Related posts

కల్తీ లడ్డులో మరో 11 మంది నిందితులు

Satyam News

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు

Satyam News

Vijay Effect: నిట్టనిలువుగా చీలిపోయిన ఏఐఏడిఎంకే

Satyam News

ఇంద్రకీలాద్రిపై 6 నుంచి కుంభాభిషేకం

Satyam News

రూ.20 లక్షలతో పానీపూరీ వ్యాపారి పరార్!

Satyam News

అయిజలో అంతర్జాతీయ మహిళా కబడ్డీ టోర్నమెంట్

Satyam News

Leave a Comment