25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

ఏపీఎస్పీలో హెడ్ కానిస్టేబుళ్లకు ప్రత్యేక పదోన్నతులు

సమస్య ఏదైనా తన దృష్టికి తీసుకువస్తే అండగా ఉంటానంటూ భరోసా ఇస్తున్నారు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న తమ పదోన్నతుల సమస్య పరిష్కరించాలంటూ ప్రజాదర్బార్ లో తనను కలిసి ఏపీఎస్పీ హెడ్ కానిస్టేబుళ్లు చేసిన విజ్ఞప్తి పట్ల మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించారు.

వారికి అండగా నిలిచారు. మంత్రి లోకేష్ చొరవతో ఏపీఎస్పీ(APSP)లో హెడ్ కానిస్టేబుల్ నుంచి అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్ స్పెక్టర్లుగా(ARSI) 300 మందికి పదోన్నతులు కల్పిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలీస్ శాఖలోని సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ సిబ్బందికి పదోన్నతులు కల్పిస్తూ 2014-19 మధ్య ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అయితే కొన్ని సాంకేతిక కారణాలు, ఎన్నికల నియమావళి అమలులోకి రావడంతో ఏపీఎస్పీ సిబ్బందికి మాత్రం పదోన్నతులు నిలిచిపోయాయి. ఆ తర్వాత వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ స్పందన లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్ లో మంత్రి నారా లోకేష్ ను కలిసిన సిబ్బంది.. తమ సమస్య పరిష్కరించాలంటూ విన్నవించారు.

అండగా ఉంటామంటూ మంత్రి హామీ ఇచ్చారు. దీంతో ఇచ్చిన మాట నిలుపుకుంటూ పదోన్నతుల ప్రక్రియను ప్రారంభించి అమలులో చొరవ చూపారు. పదోన్నతులు కల్పించి 300 మంది కుటుంబాల్లో ఆనందం నింపడం పట్ల ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది మంత్రి లోకేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

31న విడుదలకు సిద్ధమౌతున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి”

Satyam News

కేంద్రంలో ఏపీ గళం:రాజ్యసభలో పెరగనున్న టీడీపీ బలం

Satyam News

ప్రభుత్వ డబ్బులు కొట్టేసిన మరో ఐఏఎస్ అధికారి అరెస్టు

Satyam News

చెప్పులు ధరించి శ్రీవారి ఫోటో…. బొత్స ప్లాన్‌ బూమరాంగ్‌… వైసీపీ సెల్ఫ్‌ గోల్….!!

Satyam News

యూట్యూబర్ నాన్సీ హత్యకు అసలు కారణం ఏమిటి?

Satyam News

షోపియాన్ జిల్లాలో లష్కరే తోయిబా కమాండ్ హతం

Satyam News

Leave a Comment