31.6 C
Hyderabad
September 30, 2026
హైదరాబాద్హోమ్

నాలుగు కమిషనరేట్ల  పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ

#CVAnand

తెలంగాణ రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ సి.వి. ఆనంద్ గురువారం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయా కమిషనరేట్ల పోలీస్ కమిషనర్లు పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ, పరిధుల విభజన, పరిపాలనా అవసరాలు తదితర అంశాలపై తమ ప్రతిపాదనలను డీజీపీకి వివరించారు.

ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు (జీఓలు)కు అనుగుణంగా పోలీస్ స్టేషన్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ సంస్థలు, రెవెన్యూ డివిజన్లు, న్యాయస్థానాల పరిధులను పరిగణనలోకి తీసుకుని పోలీస్ స్టేషన్ హద్దులను నిర్ణయించాలని సూచించారు.

భవిష్యత్ పట్టణ విస్తరణ, జనాభా పెరుగుదల, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక ప్రణాళికతో పోలీస్ స్టేషన్ల పరిధులను పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. ఈ ప్రక్రియలో సంబంధిత అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల పోలీస్ స్టేషన్ పరిధుల నిర్ణయంపై ప్రత్యేక సూచనలు చేసిన డీజీపీ, పోలీస్ స్టేషన్ ల పరిధుల మార్పులు , చేర్పుల నిర్ణయం వల్ల ప్రజలకు, ప్రభుత్వ శాఖలకు, న్యాయవ్యవస్థకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే, ఆయా ప్రాంతాల భౌగోళిక, పరిపాలనా ప్రత్యేకతలను ప్రతిబింబించే విధంగా పోలీస్ స్టేషన్లకు తగిన పేర్లు నిర్ణయించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రజాకేంద్రిత, సమర్థవంతమైన పోలీసింగ్ మరింత బలోపేతం కావడంతో పాటు ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని డీజీపీ ఆకాంక్షించారు.

ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి, మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతితో పాటు జాయింట్ కమిషనర్లు ఇతర సీనియర్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

యుద్ధంపై ట్రంప్ ప్రకటనతో పడిపోయిన చమురు ధరలు

Satyam News

పదో తరగతి పరీక్షల నిర్వహణపై సమావేశం

Satyam News

దుబాయ్ ని వదిలి వెళుతున్న ప్రవాసులు

Satyam News

ట్రంప్ వెళ్లగానే చైనాతో చర్చలకు వెళుతున్న పుతిన్

Satyam News

ఎంఎల్ పార్టీల సాయుధ పోరాట విరమణ

Satyam News

జగన్‌ మత ఉగ్రవాది…..  బాంబు పేల్చిన విజయసాయి!

Satyam News

Leave a Comment