మహబూబ్ నగర్హోమ్

గురుకుల పాఠశాల హాస్టల్ లో ఆహార నాణ్యతపై దృష్టి

#PonnamPrabhakar

గురుకుల పాఠశాల హాస్టల్ లో విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉయ్యాలవాడ మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలను నేడు ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పాఠశాల పునఃప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు బోధించిన పాఠ్యాంశాలు, విద్యా ప్రమాణాలు, వసతి సౌకర్యాలపై మంత్రి సమగ్రంగా ఆరా తీశారు.

పాఠశాలలో చదువుతున్న 800 మందికి పైగా విద్యార్థులతో నేరుగా మాట్లాడిన మంత్రి, వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు స్నానాలకు వేడి నీటి సౌకర్యం కల్పించాలని కోరగా, అందుకు సోలార్ ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గురుకులాల్లో లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మంత్రి అక్కడి మెనూను పరిశీలించి భోజన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టోర్‌రూమ్‌లోని వంట సరుకుల నాణ్యతను తనిఖీ చేయడంతో పాటు వంటగదిలో తయారవుతున్న ఆహార పదార్థాలను పరిశీలించారు. కూరగాయల నాణ్యతను కూడా పరిశీలించిన ఆయన, వంటల్లో ఎల్లప్పుడూ తాజా కూరగాయలనే ఉపయోగించాలని అధికారులకు సూచించారు.

పాఠశాలలో విద్యాబోధన, వసతి సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యకు, ముఖ్యంగా సంక్షేమ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, ఇందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనీయులని అన్నారు.

తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు గురుకుల పాఠశాలలను సందర్శించాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులు గురుకులాలను సందర్శించి విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలని సూచించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంస్థలు ముందుకు రావాలని, పేద విద్యార్థులకు అందించే సహాయం విద్యాభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు.

విద్యార్థుల్లో క్రమశిక్షణ, విద్యపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గ్రూప్-1, గ్రూప్-2, యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నవీన ఆవిష్కరణల కార్యక్రమాల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని అన్నారు. తెలంగాణ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని, ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ గురుకులాల్లో లభిస్తున్న అవకాశాలను ప్రతి విద్యార్థి పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Related posts

జగనన్న ఇళ్ల స్థలాల వెనుక వెయ్యి కోట్ల భూ దందా

Satyam News

ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి యత్నం

Satyam News

ఈ-ఫైళ్ల క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడు సరికొత్త రికార్డు

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

రౌడీషీటరు ప్రియుడు తో కలిసి భర్త కు స్పాట్

Satyam News

వైసీపీని భయపెట్టిన జగన్‌ టూర్‌…!!

Satyam News

Leave a Comment