జాతీయంహోమ్

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం శత శాతం పూర్తి

#BhogapuramAirport

ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరు తో భోగాపురం విమానాశ్రయం శత శాతం పూర్తయిందని,ప్రైమ్ మినిస్ట‌ర్ ఆఫీస్  నుంచీ ఓపెనింగ్ తేదీకి అంతా నిరీక్షిస్తున్నామ‌ని  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రధాని మోది కార్యాలయంకు ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించారని.. త్వరలోనే భోగాపురం విమానాశ్రయంను ప్రరంభించుకోనున్నట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

అల్లూరి సీతారామరాజు భోగాపురం  ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను అయన పరిశీలించారు. .ఈ సందర్భంగా నిర్వ‌హించిన విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి  రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. భోగాపురం విమానాశ్రయం అద్భుతంగా నిర్మాణం అయిందని అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, జి.ఎం.ఆర్ సంయుక్తంగా పని చేసి ఈ అద్భుతాన్ని సాధ్యం చేశారని తెలిపారు.సీఎం చంద్ర‌బాబు డిసెంబర్ 2026 లోగా నిర్మాణానికి డెడ్ లైన్ విధించగా.. ఆరు నెలల  ముందుగానే నిర్మాణం పూర్తి చేస్తున్నామన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా తన ప్రాంతంలో జరుగుతున్న విమానాశ్రయం కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపడంతో పాటు, జి.ఎం.ఆర్. ఎయిర్పోర్ట్ అధారిటి ఆఫ్ ఇండియా కలసి రెండేళ్ళలోనే నిర్మాణం పూర్తి చేసుకున్నట్లు స్పష్టం చేశారు.

గడచిన నెలరోజులుగా పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగిందని అన్నారు. ప్రారంభోత్సవం అయిన వారం రోజుల తరువాత పూర్తి స్థాయి కార్యకలాపాలు, రాకపోకలు సైతం ఎయిర్ పోర్టులో కొనసాగుతాయని స్పష్టం చేశారు. 4 కోట్ల మంది ప్రయాణీకుల రాకపోకలకు అనువుగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం చేసినట్టు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

టైర్ వన్ సిటిలలో ఏర్పాటయ్యే విమానాశ్రయాలకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో వసతులు చేరువ చేసినట్టు తెలిపారు. ఎగిరే చేప ఆకృతిలో 78000 చదరపు అడుగుల పరిమాణంలో టెర్మినల్ భవనం నిర్మాణం జరిగినట్టు తెలిపిన రామ్మోహన్ నాయుడు.. ఇంటిరియర్, ఎక్స్ టీరియర్ వసతులు మరింత అందంగా.. స్థానిక సంస్కృతి అద్దం పట్ట్లేలా తీర్చిదిద్దినట్టు తెలిపారు.

ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం

దేశంలో ఇటివల కాలంలో నిర్మాణం అయిన విమానాశ్రయాలలో.. భోగాపురం.. అత్యుత్తమమైనదని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కొలువుతీరిన తరువాత మొదటి ప్రాధాన్యతగా అని శాఖలను సమన్వయం చేసుకుంటూ నిర్మాణం పూర్తిచేసుకుందని తెలిపారు.

భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు పూర్తి అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని తెలిపిన రామ్మోహన్ నాయుడు.. స్థానిక రైతుల తోడ్పాటు తోనే ఇంత గొప్ప అద్భుతం కార్యరూపం దాల్చిందని అన్నారు. విశాఖపట్నం కు విమానాశ్రయం దూరం అవుతోందనే అపోహను ఎవ్వరూ పెట్టుకోవద్దని మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు.

భోగాపురం విమానాశ్రయంకు అనుసంధానం అయ్యే ఏడు రోడ్లను మరింత విశాలంగా, ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు. విశాఖ ఆర్కే బీచ్ నుండి భోగాపురం మీదుగా ఆరు లైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని, అన్ని అనుమతులు పూర్తైన తరువాత రెండేళ్లలో నిర్మాణం పూర్తికి ప్రయత్నిస్తున్నట్టు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

గతంలో భేగంపేట విమానాశ్రయం ఉన్న సమయంలోనే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణం చేపట్టారని గుర్తు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఇప్పుడు 5000 ఎకరాల్లో నిర్మాణం అయిన శంషాబాద్ విమానాశ్రయం.. భవిష్యత్ అవసరాలను కూడా సమృద్దిగా అందిస్తున్నట్టు గుర్తు చేశారు.

మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధిని చేరువ చేస్తోందని.. అన్ని రంగాల అభివృద్ధికి అనుసంధానం అయ్యే శాఖా విమానయాన రంగానికి ఉందని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రాబోయే 25 – 50 ఏళ్ల అవసరాలకు వీలుగా సీఎం చంద్ర‌బాబు సూచనలతో భోగాపురం  ఏర్ పోర్ట్  నిర్మాణం పూర్తి చేసినట్టు తెలిపారు.

కార్గో కోసం ప్రత్యకంగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం అయిందని.. ఆక్వా, ఫార్మా రంగాలకు ఉపయుక్తంగా నిలవనుందని తెలిపారు. ప్రధాని మోడీ సూచనల మేరకు.. దేశంలో విమానాల మెంటేనేన్స్, రిపేర్, ఆపరేషన్ స్థానికంగానే ఏర్పాటు ఉండాలని ఎమ్మార్వో నెట్వర్క్ ను విస్తృతం చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 850 కి పైగా విమానాలు అందుబాటులో ఉన్నాయని, భవిష్యత్ లో 1600కి పైగా ఆర్డర్ ఇచ్చినట్టు తెలిపారు.

ప్రతీ ఏడాది 110 విమానాలు సేవలు అందించడంలో కలుస్తూ ఉన్నాయని. వాటి మెంటేనేన్స్ కోసం బయట దేశాలు వెళ్ళకుండా, బయట దేశాల విమానాలు కూడా ఎం.ఆర్.వో సేవల కోసం మన దేశం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు గుర్తు చేశారు. స్థానిక యువతకు ఉపయుక్తంగా ఉండేలా ఎడ్యుసిటి నిర్మాణం కోసం తోడ్పాటు అందించిన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు  ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఏవియేషన్ హబ్ గా మారిన భోగాపురం

విమానయానం లోని ఎమ్మార్వో నెట్వర్క్, ఎడ్యు సిటి, ఇతర అన్ని సదుపాయాలు చేరువ అవుతూ ఉండటంతో.. భోగాపురం ప్రాంతం అంతర్జాతీయంగా ఏవియేషన్ హబ్ గా అవతరించబోతోందని  కేంద్ర పౌర విమాన‌యాన శాఖ‌ రామ్మోహన్ నాయుడు అన్నారు.

యు.డి.ఎఫ్ చార్జీల విషయంలో అడిగిన ప్రశ్నకు  మంత్రి  రామ్మోహ‌న్ నాయ‌డు సమాధానం ఇస్తూ… పెట్టుబడి, ప్రయాణీకుల రద్దీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటూ.. ఒక నిర్దిష్టమైన ఫార్ములా ప్రకారం యుడిఎఫ్ చార్జీలను విధించడం జరుగుతుందన్నారు.

ప్రతీ అయిదేళ్ళకు ఎరా నిబంధనల ప్రకారం ఈ యుడిఎఫ్ చార్జీలను క్రమబద్ధీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదం అయ్యేలా యుడిఎఫ్ చార్జీలు అమలయ్యేలా కేంద్ర పౌర విమానయాన శాఖ భాద్యత తీసుకుంటుందని తెలిపారు.

20000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో భోగాపురం కార్గో  నిర్మాణం జరుగుతోందని, ఫార్మా రంగంతో పాటు, మామిడి, హార్టికల్చర్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ను ఇక సులభంగా ఎగుమతి చేసేందుకు భోగాపురం వారధిలా ఉపయోగపడుతుందని అన్నారు.

విశాఖపట్నం నుండి మెట్రో అభివృద్ధి కోసం మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ వద్ద డబుల్ డెక్కర్ లైన్ ప్రతిపాదన పరిశీలనలో ఉందని.. పూర్తి స్థాయి సర్వే అనంతరం అతి త్వరలోనే మెట్రో కూడా కార్య రూపం దాల్చుతుందని తెలిపారు. మెట్రో ఏర్పాటు, రహదారులు విస్తృతం తరువాత ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెలిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు. జిల్లా ఎప్పీ దామోద‌ర్, జి.ఎం.ఆర్. ప్రాజెక్ట్ హెడ్ రామరాజు, సీఈవో లక్కీ వర్మ భాస్కర్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

పురుషుడిలో స్త్రీ లక్షణాలు: గుంటూరు లో అరుదైన వ్యాధి

Satyam News

అది దేవాదాయ శాఖకు పూజారులకు మధ్య వివాదం

Satyam News

విజయవాడలో ఘనంగా ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవాలు

Satyam News

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

Satyam News

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి మరో రూ. 8 వేల కోట్ల సాయం

Satyam News

Leave a Comment