26.7 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటంగ్ సెంటర్ గా అమరావతి

#QuantumValley

చంద్రబాబు ట్రెండ్‌ ఫాలో అవరు… ట్రెండ్‌ సెట్‌ చేస్తారు. ఎంతో ముందు చూపుతో.. గొప్ప విజన్‌తో ఐటీ ద్వారా అద్భుతాలు సృష్టించారు. ఒక గ్లోబల్‌ సిటీనే నిర్మించారు. ఇప్పుడు క్వాంటం టెక్నాలజీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో ప్రతి ఒక్కరూ గుర్తుపట్టే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు సీబీఎన్. అందుకే ఆయన పేరే ఒక బ్రాండ్‌.. ఆయన మాట్లాడితే మోటివేషన్.. ఆయన విజన్‌ ఎంతో మందికి ఆదర్శం. అమరావతిలో క్వాంటం టాక్‌ బై సీబీఎన్‌ కార్యక్రమానికి 54 వేల మంది విద్యార్ధులు ఆన్‌లైన్‌లో అటెండ్‌ అవడమే సీబీఎన్ బ్రాండ్‌ వ్యాల్యూకి నిలువెత్తు నిదర్శనం.

ఐటీలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి ఒక ఎత్తు.. క్వాంటం కంప్యూటర్స్‌తో టెక్నాలజీ రంగం నెక్ట్స్‌ లెవెల్‌కి జంప్‌ చేస్తుంది. అందుకే.. అందరి కంటే ముందే ఈ రంగంలో స్కిల్స్‌ డెవలప్‌ చేసుకొంటే.. ఫ్యూచర్‌ టెక్నాలజీలో ఫస్ట్‌ మూవర్‌ అడ్వాంటేజ్‌ ఉంటుంది. ఈ ఆలోచనతోనే అమరావతిలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి ప్లాన్ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. క్వాంటం సాఫ్ట్‌వేర్‌తో పాటు.. హార్డ్‌వేర్‌ కూడా అమరావతిలో ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

అమరావతిలో ప్రారంభిస్తున్న క్వాంటం వ్యాలీ ద్వారా 10 లక్షల మందికి ఈ టెక్నాలజీలో శిక్షణ అందిస్తారు. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, క్వాంటం మెటీరియల్స్ వంటి నెక్ట్స్ జనరేషన్‌ టెక్నాలజీల్లో నిపుణులను తయారు చేస్తారు. క్వాంటం కంప్యూటర్ల తయారీలో వాడే క్రయోజెనిక్స్, సెమీకండక్టర్లతో పాటు.. ఇవి పని చేయడానికి అవసరమైన అల్గారిథమ్స్‌ని కూడా అమరావతి నుంచే అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్‌ టెక్నాలజీలో నైపుణ్యం సాధించడం ద్వారా అత్యధిక వేతనాలు పొందే అవకాశం ఉంటుంది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రపంచ ఐటీ అభివృద్ధికి ప్రధాన కేంద్రం అయితే.. ఏపీలోని అమరావతి.. క్వాంటం టెక్నాలజీకి మెయిన్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు.

Related posts

ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటాలి

Satyam News

యాంకర్ అనసూయపై అసభ్య పోర్టు: ఒకరి అరెస్టు

Satyam News

సత్వర ఫైళ్ల క్లియరెన్సుతో సత్వర సేవలు

Satyam News

వారితో పోటీ పడటం కష్టంగా ఉంది…..

Satyam News

సంపూర్ణ చంద్రగ్రహణం ఇప్పుడు పరిపూర్ణం

Satyam News

హర్యానా మాజీ సీఎంపై సీబీఐ చార్జిషీట్ దాఖలు

Satyam News

Leave a Comment