విశాఖపట్నంహోమ్

ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యశ్యామలం

#KimidiKalaVenkatrao

విజయనగరం జిల్లాలో మీడియం  ఇరిగేషన్ ప్రాజెక్టులకు తానే శంకుస్థాపన చేసి తానే ప్రారంభించిన ఘనతను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సాధించారని ఎం.ఎల్.ఏ  కిమిడి కళా వెంకటరావు పేర్కొన్నారు. చీపురుపల్లి మండలం రావివలస లో  నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమం, పించన్ల పంపిణీ కార్యక్రమం లో సీఎం  చంద్ర బాబు  పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం లో ఆయన ప్రసంగిస్తూ గత ప్రభుత్వం ఇరిగేషన్, కర్మాగారాలను నిర్లక్ష్యం  చేసిందని, ఈ ప్రభుత్వం జిల్లాను సస్యశ్యామలం చేసిందని,  స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించి ఉత్తరాంధ్ర లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.ఎంపీ కలిసేట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ  తెలుగు జాతి  గొప్పతనాన్ని, గౌరవాన్ని పెంచిన  ముఖ్యమంత్రి చంద్రబాబేనని కొనియాడారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎంతో కృషి చేస్తున్న విజనరీ ముఖ్యమంత్రి మిగిలిన రాష్ట్రాలకు  ఆదర్శమని అన్నారు.

బంగారు కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్ర‌బాబు

అమ్మ , నాన్న లేని అనాధలైన  రేగిడి హారిక, అఖిల  సిస్టర్స్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆర్ధిక సహాన్ని ప్రకటించారు.  ప్రజావేదిక సాక్షిగా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని ప్రకటించి వారి భవిష్యత్తుకు భరోసా, భద్రత  కల్పించారు. పి 4 లో భాగంగా  గరివిడి మండలం కొండదాడి గ్రామానికి  చెందిన మార్గదర్శి   పి. సాయి గోపాల్ వర్మ  అనాధ బాలికలైన హారిక, అఖిల సిస్టర్స్ ను  దత్తత తీసుకొని   బి.ఎస్.సి కంప్యూటర్ సైన్సు  చదివిస్తున్నారు.

ప్రజావేదిక వద్ద బంగారు కుటుంబాన్ని, మార్గదర్శిని ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం  సి.ఎం మాట్లాడుతూ   అనాధ బాలికలకు ఏ  ఒక్క పధకము వర్తించ నందున  ఆర్ధిక సహాయం చేస్తున్నానని ప్రకటించారు.  గతం లో జన్మభూమి  పిలుపు ద్వారా ప్రపంచం  లో నున్న తెలుగువారంత ఒక్కటై వారి గ్రామాల్లో సేవ చేసారని, అదే స్ఫూర్తి తో పి 4 కు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్ధిక అసమానతలను తొలగించడానికి  ముందుకు వచ్చేవారు అభినందనీయులన్నారు.

పించందారును కలిసి పించన్ ఇచ్చిన సీఎం చంద్ర‌బాబు

గిరిజన వృద్ధ  పించనుదారులైన రోంగలి  ఎల్లయ్య కు  తన ఇంటి వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి వికలాంగ పించన్  రూ. 4,000  ను అందజేశారు. అనంతరం ఆయనతో సి.ఎం మాట్లాడి వారి కుటుంబ నేపద్యం, జీవన విధానం , తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జ్ మంత్రి వంగలపూడి అనిత , ఎం.ఎస్.ఎం.ఈ, సెర్ప్  శాఖల మంత్రి కొండపల్లి  శ్రీనివాస్, సెర్ప్  సి.ఈ.ఓ  వాకాటి కరుణ , వైద్య శాఖ కమీషనర్ వీరపాండ్యన్ , పించన్ దారులు కొక్కేర్ల కాంతమ్మ , మన్నేల రాము  తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశ్వాస పరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం

Satyam News

ఏపీకి కేంద్ర కేబినెట్‌ మరో గుడ్‌ న్యూస్‌

Satyam News

గ్రామీణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

Satyam News

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

అసైన్మెంట్ భూములకు రక్షణ కల్పించాలి

Satyam News

AI గేట్‌ వే ఆఫ్‌ ఆసియాగా విశాఖ

Satyam News

Leave a Comment