ప్రత్యేకంహోమ్

బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న చంద్రబాబు

ముంబై వేదికగా జరిగిన ఎకనమిక్ టైమ్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ – 2025’ అవార్డును అందుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుమతుల ప్రక్రియ అత్యంత వేగంగా జరుగుతోందని, ఈ అవకాశాన్ని పారిశ్రామికవేత్తలు అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు. ఏపీలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

దేశంలో అమలువుతున్న ఆర్థిక సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడిందని, పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ మరియు ‘స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్’ సూత్రాల ఆధారంగా సుపరిపాలన అందిస్తోందని వివరించారు. ముఖ్యంగా సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమి వంటి వినూత్న సేవలను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థాయి దేశంగా ఎదుగుతోందని చంద్రబాబు కొనియాడారు. మోదీని ఒక గొప్ప రిఫార్మర్, పెర్ఫార్మర్ మరియు విన్నర్‌గా ఆయన అభివర్ణించారు. ఈ అవార్డు గుర్తింపు ద్వారా ఏపీకి మరింతగా పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.

Related posts

జర్నలిజాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది

Satyam News

పంటకోత ప్రయోగ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ గణాంకాధికారి

Satyam News

ఇక గ్రేటర్‌ విజయవాడ… పదింతలు పెరుగుతుంది..

Satyam News

ఇమ్రాన్ ఖాన్ కు వెసులుబాటు కల్పించిన సుప్రీంకోర్టు

Satyam News

రాజమండ్రి జైలు నుంచి అంబటి రాంబాబు తరలింపు

Satyam News

విమానయానంపై తీవ్ర ప్రభావం: తగ్గుతున్న విమాన సర్వీసులు

Satyam News

Leave a Comment