సినిమాహోమ్

సినీ నటి జయవాహిని కన్నుమూత

తెలుగు సీరియల్స్, సినిమాల్లో నటిగా గుర్తింపు పొందిన జయవాహిని కన్నుమూశారు. ఆమె మణికొండలో నివసిస్తూ, కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందారు.

చికిత్స సమయంలో పరిస్థితి మరింత విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం జిల్లాలోని స్వస్థల గ్రామానికి తరలించారు. అక్కడే ఆమె ఈ రోజు సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి.

జయవాహిని పలు టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. సహజ నటనతో పాటు భావోద్వేగ పాత్రల్లో ఆమె చేసిన నటనకు మంచి ప్రశంసలు లభించాయి. సీరియల్స్‌తో పాటు కొన్ని సినిమాల్లో కూడా ఆమె నటించారు.

ఆమె మృతితో తెలుగు టెలివిజన్ రంగం ఒక మంచి నటిని కోల్పోయింది. అభిమానులు, సహనటులు, సినీ, టీవీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు.

Related posts

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

ఆధ్యాత్మిక భావనలతో టెంపుల్ టూరిజం

Satyam News

ఈ ఘనత నా ఒక్కడిదే కాదు

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

Satyam News

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Satyam News

ఇదేనా మీరు చెప్పే అంతర్జాతీయ ప్రమాణాలు రేవంత్ రెడ్డి?

Satyam News

Leave a Comment