నెల్లూరుహోమ్

“వన్ మంత్… వన్ విలేజ్.. ఫోర్ విజిట్స్”

#HimahshuShuklaIAS

నెల్లూరు జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న వన్ మంత్… వన్ విలేజ్… ఫోర్ విజిట్స్ ” కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబునాయుడు మెచ్చుకున్నారు. వింజమూరు ప్రజా వేదిక సభలో సీఎం  ప్రత్యేకంగా ఈ కార్యక్రమంపై ప్రస్తావించారు. ఒక నెలలో ఒక గ్రామంలో నాలుగు సార్లు రెవెన్యూ అధికారులు పర్యటించి ఆ గ్రామంలో ఉన్న సమస్యలను పూర్తిగా పరిష్కరించేందుకు కృషి చేస్తారని, దీంతో రెవెన్యూ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయని సీఎం అన్నారు.

ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా ప్రవేశపెట్టిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తొలుత ఎగ్జిబిషన్ స్టాల్స్ ను పరిశీలించిన సీఎం ఛాంపియన్ ఫార్మర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమం కూడా జిల్లాలో బాగా అమలు చేస్తున్నారని, వ్యవసాయ రంగంలో రైతులను చైతన్యపరిచేందుకు, నూతన విధానాలను ఛాంపియన్ ఫార్మర్ల ద్వారా ఇతర రైతులకు పరిచయం చేసేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. వన్ మంత్ వన్ విలేజ్  ఫోర్ విజిట్స్, ఛాంపియన్ ఫార్మర్ కార్యక్రమాలను సీఎం ప్రత్యేకంగా పేర్కొంటూ కలెక్టర్ హిమాన్షు శుక్ల ను అభినందించారు.

Related posts

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

బెంగాల్, తమిళనాడులో పోలింగ్ ప్రారంభం

Satyam News

మీరట్ లో ఘోర ప్రమాదం: 5 గురు చిన్నారులు మృతి

Satyam News

రాయచోటిలో వర్ష బీభత్సం: నలుగురు మృతి

Satyam News

గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దర్శనం కు మార్గం సుగమం

Satyam News

రెగ్యులర్ షూటింగ్ లో భీమవరం టాకీస్ “మహానాగ”

Satyam News

Leave a Comment