సంపాదకీయంహోమ్

వైసీపీ కుట్రలు….. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై డర్టీ పాలిటిక్స్‌

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై వైసీపీ డర్టీ పాలిటిక్స్‌ ప్రారంభించింది. మృతుల కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయిన విషాద సమయంలోనూ.. ఉద్యోగ సంఘాల ముసుగులను రెచ్చగొట్టి.. గొడ్డలి పార్టీ శవ రాజకీయాలు చేస్తోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి లోకేశ్‌పై.. వక్ర భాష్యాలతో ఫేక్‌ ప్రచారాలు మొదలుపెట్టారు.

మృతుల కుటుంబ సభ్యులతో.. మాట్లాడుతున్న సమయంలో కార్మిక సంఘాల పేరుతో కొంత మంది.. లోకేశ్‌ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే ఎందుకు అడ్డుకున్నారు.. అని లోకేశ్‌ ప్రశ్నించడాన్ని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాను కార్మిక సంఘాల నాయకులను కలిసేందుకు రాలేదని.. మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వచ్చానని అనునయించే ప్రయత్నం చేశారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వచ్చానని చెప్పడాన్ని వైసీపీ మీడియా వక్రీకరించింది. అక్కడ జరగని దాన్ని జరిగినట్లు ట్విస్ట్‌ చేసి.. కార్మికులపై మంత్రి లోకేశ్‌ అసహనం అంటూ.. బాధితుల వేదనని పొలిటికల్ పాయింట్లు స్కోర్ చేయడానికి వాడుకొంటున్నారు.

కార్మికులను ఎప్పుడూ పట్టించుకోకపోగా.. స్టీల్‌ ప్లాంట్‌ భూములపై కన్నేసిన వైసీపీ రాంబధులు.. ఇప్పుడు ప్రమాదం జరగ్గానే గద్దల్లా వాలిపోయారు. వైసీపీ హయాంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్‌కి అప్పటి సీఎం జగన్‌ ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. పైగా విలువైన స్టీల్‌ ప్లాంట్‌ భూములు కొట్టేయాలని చూశారు. ప్రతిపక్షంలో ఉండగా.. తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉద్యమాలు చేసి.. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకొన్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. స్టీల్‌ ప్లాంట్‌కి పూర్వ వైభవం తెచ్చేందుకు మోడీ సర్కారును ఒప్పించి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సుమారు 15 వేల కోట్ల ప్యాకేజీ ఇప్పించారు. త్వరలో మరో 8 వేల కోట్ల ప్యాకేజీ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకొన్న చర్యల కారణంగానే ఎప్పటి నుంచో నష్టాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ ఈ ఏడాది జనవరిలో లాభాల్లోకి వచ్చింది.

స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 8 మంది మరణించడం విషాదకరం. ఈ దుర్ఘటన రాష్ట్రంలో ప్రతి ఒక్కరినీ బాధిస్తోంది. ప్రమాద జరిగిన స్థలాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌.. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకొంటామని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి, కార్మికుల రక్షణ కోసం ఆలోచిస్తుంటే.. వైసీపీ మాత్రం ఈ విషాదన ఘటనను రాజకీయ లబ్ది కోసం వాడుకోవాలని చూస్తోంది.

కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోరమైన ప్రమాదం జరిగినా.. ఢిల్లీ పెద్దలపై గొడ్డలి పార్టీ నాయకులు గానీ, మీడియా గానీ చిన్న విమర్శ చేయలేదు, ఒక్క మాట అనలేదు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే సెంటిమెంట్‌ని నిలబెట్టడానికి.. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం కాకుండా.. లాభాల్లో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు.. పని చేసే వారికే విమర్శలు తప్పవని వైసీపీ శవ రాజకీయలు మరోసారి రుజువు చేస్తున్నాయి. సొంత పార్టీ కార్యకర్తను కారు కింద తొక్కించి.. పట్టించుకోకుండా పక్కన పడేసి వెళ్లిపోయిన చరిత్ర కలిగిన.. గొడ్డలి బ్యాచ్‌.. ఇప్పుడు సొంత మీడియాలో.. లోకేశ్‌ అసహనం అంటూ ఫేక్‌ వార్తలు ప్రచారం చేయడం ఆ పార్టీ నైజానికి అద్దం పడుతోంది.

Related posts

యుద్ధ ప్రభావంతో కండోమ్ ల ధరల పెరుగుదల?

Satyam News

టీటీడీలో జాబులు అమ్ముకున్న భూమన…???

Satyam News

సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు పై కేసు నమోదు

Satyam News

ముంబైలో ఘోరం: గాల్లో ఆగిపోయిన మోనోరైళ్లు

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

Leave a Comment