హైదరాబాద్హోమ్

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ

#Revanthreddy

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించి, వారి సేవలు—త్యాగాలను గౌరవించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం జీఓ ఆర్టీ నం.679 జారీ చేసింది. ఉద్యమంలో కొందరు ప్రాణత్యాగం చేయగా, మరికొందరు శారీరక వైకల్యానికి గురయ్యారు. పలువురిపై కేసులు నమోదై జైలు జీవితం గడిపిన నేపథ్యంలో, వారి సేవలను అధికారికంగా గుర్తించాలనే చాలాకాలంగా ఉన్న డిమాండ్పై ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కమిటీ చైర్మన్ గా కే. కేశవరావు

ఈ కమిటీకి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె. కేశవరావు చైర్మన్ గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, ఎమ్మెల్సీ-విప్ అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎస్. రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి నియమితులయ్యారు. సాధారణ పరిపాలన శాఖ పొలిటికల్ సెక్రటరీ ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారు.

తెలంగాణ ఉద్యమకారులను గుర్తించెందుకు ముందుగా స్పష్టమైన ప్రమాణాలను రూపొందించడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. ఆ ప్రమాణాల ఆధారంగా ఉద్యమకారుల జాబితాను సిద్ధం చేస్తుంది. అనంతరం వారికిఎలాంటి గుర్తింపు, గౌరవం, సౌకర్యాలు కల్పించాలనే అంశాలపై ప్రభుత్వానికి సిఫారసులు చేస్తుంది.

త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశం

కమిటీ అవసరమైతే అధికారులను పిలిపించుకోవచ్చు. సమాచారం సేకరించవచ్చు. సమావేశాలు నిర్వహించవచ్చు. అవసరమైన ఇతర వ్యక్తులు, అధికారులను కూడా సంప్రదించవచ్చు. కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి వీలైనంత త్వరగా సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు, కార్యదర్శులు కమిటీకి అవసరమైన సహకారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Related posts

వేధింపులే యువ డాక్టర్ ఆత్మహత్య కు కారణం

Satyam News

మేడారం జాతర పనుల పురోగతిపై ఆకస్మిక తనిఖీ

Satyam News

కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి

Satyam News

యశోద హాస్పిటల్స్ లో అత్యాధునిక “పల్స్ ఫీల్డ్ అబ్లేషన్” (PFA)

Satyam News

‘భూభారతి’: భూసర్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పు

Satyam News

కెసిఆర్ అప్పులన్నీ అభివృద్ధికి పెట్టుబడులే..

Satyam News

Leave a Comment