హైదరాబాద్హోమ్

నిధులు ఆంధ్రాకు నీతులు తెలంగాణకు

#KalvakuntlaKavita

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ ప్రజలకు పొదుపు సూత్రాలు చెప్పారని, కానీ ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం భారీగా నిధులు ఇచ్చారని తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా అంశంపై ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.

పోలవరం ప్రాజెక్ట్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తున్నారని, కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. “మీ గురువును చూసైనా నేర్చుకోండి.. ప్రధానికి లేఖ రాసి జాతీయ హోదా కోసం పోరాడండి” అంటూ రేవంత్ రెడ్డికి సూచించారు.

తెలంగాణ రాష్ట్రం నీళ్ల కోసం ఏర్పడిందని, అయినప్పటికీ గోదావరి జలాల్లో పావు భాగం కూడా, కృష్ణా జలాల్లో సగం కూడా రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే సాగుకు అనువైన ప్రతి గుంటకు నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రత్యేక వాటర్ కమిషన్ ఏర్పాటు చేసి నీటి నిర్వహణ మొత్తం దాని ఆధ్వర్యంలో సాగుతుందని తెలిపారు. ప్రతి మూడు వేల ఎకరాలకు ఒక “లష్కర్” నియమిస్తామని, చిన్న నదులపై బలమైన చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తామని వెల్లడించారు.

కృష్ణా నదిలో ఆంధ్రప్రదేశ్ 771 టీఎంసీల నీటిని వినియోగించుకుందని, తెలంగాణ మాత్రం తన వాటాను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోయిందన్నారు. శ్రీశైలం, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, సుంకేశుల బ్యారేజ్ వంటి ఉదాహరణలు చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ నీటి వినియోగంలో చాలా ముందుందని వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలపై కూడా కవిత స్పందించారు. విచారణ పూర్తయ్యే వరకు ఆయన దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పెద్దల పిల్లలు తప్పు చేసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తారనే భావన ప్రజల్లోకి వెళ్లిందన్నారు. బాధితురాలు మైనర్ కావడంతో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

బాధిత బాలిక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తల అత్యుత్సాహాన్ని తప్పుబట్టారు. ఫోటోలు బయటపెట్టిన వారిని గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. “మేము ఎప్పుడూ ఆడపిల్లల పక్షమే ఉంటాం” అని స్పష్టం చేశారు.

మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరిగా ఉండాలని కవిత డిమాండ్ చేశారు. జనగణనలో కులంతో పాటు ఉపకులాలు, సామాజిక స్థితిగతులను కూడా నమోదు చేయాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు జాతీయ హోదా ప్రాజెక్టులు మంజూరు చేయాలని, దేశంలోని ఇతర 16 రాష్ట్రాలకు ఇచ్చినట్లే తెలంగాణకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని ప్రకటించారు.

Related posts

పొత్తుల కోసం తహతహలాడుతున్న ‘సింగిల్ సింహం’

Satyam News

బ్రిటన్ తో వాణిజ్య ఒప్పందం నేటి నుంచి అమలు

Satyam News

హుస్నాబాద్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Satyam News

తొలి ప్రవాస భారతీయుని బయోగ్రఫీ “జిందగీ ఇన్ టు షేడ్స్”

Satyam News

షాడో గుప్పిట్లో మెడికల్ కాలేజీ విలవిల

Satyam News

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News

Leave a Comment