కడపహోమ్

రాజధాని మార్చినప్పుడు సైలెన్స్… జిల్లా కేంద్రంపై వైసీపీ రచ్చ..!

#Jagan

అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలని ఏపీ కేబినెట్‌ నిర్ణయించింది. రాజకీయం చేయడానికి ఏ అవకాశాన్నీ వదులుకోని వైసీపీ.. జిల్లా కేంద్రం మార్చడం మీదా డర్టీ పోలిటిక్స్‌ ప్రారంభించేసింది. రాయచోటి ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలని వైసీపీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఏపీ రాజధానిగా అమరావతి తమకు ఆమోదయోగ్యం అని చెప్పిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ అధికారంలోకి వచ్చాక.. నాలుక మడతేసి.. మూడు రాజధానుల పాట ఎత్తుకున్నారు.

ఏకంగా రాష్ట్ర రాజధానినే మార్చే ప్రయత్నం చేసినప్పుడు.. వైసీపీ నుంచి ఏమాత్రం వ్యతిరేకత రాలేదు సరికదా.. అమరావతిని బద్నాం చేయడానికి అనరాని మాటలు అన్నారు. ఒకరు రాజధాని ప్రాంతాన్ని స్మశానంతో పోల్చితే.. మరొకరు వరదల్లో మునిగిపోతుందని ప్రచారం చేశారు. భూకంపాలు వస్తాయని, ఒక సామజిక వర్గం మాత్రమే డెవలప్‌ అవుతుందని అనేక నిందలు మోపారు.. రాజధాని మార్చడాన్ని అడ్డంగా సమర్ధించుకొన్న అదే ఫ్యాన్‌ పార్టీ ఫ్యాన్స్.. ఇప్పుడు జిల్లా కేంద్రం మార్పు విషయంలో రచ్చ ప్రారంభించారు. అప్పట్లో కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నాయకులు రాజీనామా చేసి ఉంటే.. ఇప్పుడు అలాంటి డిమాండ్లు చేసినా అర్ధం ఉండేది.

రాజధాని మర్చాలని అనుకున్న వాళ్లు.. విశాఖలోనో, కర్నూలులోనో ఏమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. అమరావతితో పాటు కర్నూలును నిర్లక్ష్యం చేసి.. విశాఖలో దోపిడీ పర్వానికి తెర లేపారు. కూటమి ప్రభుత్వం జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు మార్చినా.. రాయచోటిని అంతకు మించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లాకి మచిలీపట్నం కేంద్రంగా ఉన్నా.. విజయవాడ ఎక్కువగా డెవలప్‌ అయింది. అదే విధంగా అన్నమయ్య జిల్లాకు మదనపల్లె కేంద్రంగా ఉన్నా.. రాయచోటిని జిల్లా కేంద్రం స్థాయిలో.. అంతకు మించి డెవలప్‌ చేయడానికి కట్టుబడి ఉన్నామని సీఎం చంద్రబాబు హామీ ఇస్తున్నారు.

Related posts

రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం

Satyam News

రామరాజ్యం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి

Satyam News

సైనికాధికారి భార్యపై కన్నేసిన దుర్మార్గులు

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

Leave a Comment