30.3 C
Hyderabad
September 23, 2026
ఆధ్యాత్మికంహోమ్

మత్స్యావతారంలో కనువిందు చేసిన శ్రీ సౌమ్యనాథస్వామి

SriSowmyanathaswamyTemple

నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు గురువారం ఉదయం తిరుచ్చిపై మత్స్యావతారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామివారు గ్రామ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు.

“విష్ణుమూర్తి ప్రథమావతారమైన మత్స్యావతార వైభవంలో” కొలువుదీరిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల గోవింద నామస్మరణ, చెక్కభజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల నడుమ సాగిన వాహనసేవ ఆధ్యాత్మిక పరవశాన్ని నింపింది. అడుగడుగునా భక్తులు కర్పూరహారతులు సమర్పించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.

ఈ వాహనసేవలో ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ దిలీప్, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Related posts

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

డ్రగ్స్ రహిత తెలంగాణ సాధిద్దాం

Satyam News

క్యాన్సర్ తో బాధపడుతున్న బాలలకు చిత్రలేఖనం పోటీలు

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

ఫేక్ జీవో లతో ప్రభుత్వ భూమి కొట్టేసిన వైసీపీ లీడర్

Satyam News

సామాజిక న్యాయ ఉద్యమ నేత బీపీ మండల్ కు ఘన నివాళి

Satyam News

Leave a Comment