ప్రపంచంహోమ్

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

#AmericanVisa

చట్టానికి సహకరించే వారికి అమెరికాలో ప్రత్యేక వీసా ఉంటుంది. దాని పేరే U వీసా. వివిధ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో పని చేసేవారు అక్కడ ఏదైనా నేరం జరిగితే పోలీసులకు సహకరించడం, నేరస్తులను పట్టించడం, చట్టానికి సహకరించడం లాంటి పనులు చేస్తే వారికి U వీసా ఇస్తారు.

మరింకేం?…. ఈ వెసులుబాటును ఉపయోగించుకోవడానికి రంభాయ్ పటేల్ అనే ఒక వ్యక్తి రంగంలో దిగాడు. రంభాయ్ పటేల్ నేతృత్వంలోని ఒక ముఠా 2023 మార్చి నుంచి ఒక ముఠా మసాచుసెట్స్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కనీసం ఆరు కన్వీనియన్స్ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్లలో ముందుగానే ప్రణాళిక ప్రకారం సాయుధ దోపిడీలను నిర్వహించింది.

ఈ నకిలీ దోపిడీల సమయంలో “దొంగ”గా వ్యవహరించిన వ్యక్తి తుపాకీలా కనిపించే ఆయుధంతో స్టోర్ ఉద్యోగులను బెదిరించి నగదు తీసుకుని పారిపోయేవాడు. ఈ ఘటనలన్నీ స్టోర్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యేలా ప్రణాళిక రూపొందించేవారు. అనంతరం దుకాణ ఉద్యోగులు ఐదు నిమిషాలకుపైగా వేచి ఉండి, దొంగ తప్పించుకున్న తర్వాత మాత్రమే పోలీసులకు ఫోన్ చేసి నిజమైన దోపిడీ జరిగినట్లు ఫిర్యాదు చేసేవారు.

స్టోర్లలో పనిచేసే ఉద్యోగులు తమను హింసాత్మక నేరాలకు బాధితులుగా చూపిస్తూ అమెరికా U వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం పొందేవారు.

U వీసా అనేది హింసాత్మక లేదా నిర్దిష్ట నేరాలకు గురై మానసిక లేదా శారీరకంగా నష్టపోయిన బాధితులకు, అలాగే నేరాల దర్యాప్తులో చట్ట అమలు సంస్థలకు సహకరించిన వారికి అమెరికా ప్రభుత్వం కల్పించే ప్రత్యేక నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా.

ఇప్పుడు తాజాగా భారతీయుడైన మిథిల్ పటేల్ అనే వ్యక్తి ఈ నేరానికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల మిథిల్ పటేల్ 2023 అక్టోబర్‌లో వోర్సెస్టర్‌లోని ఒక దుకాణంలో జరిగిన నకిలీ సాయుధ దోపిడీలో “బాధితుడి” పాత్ర పోషించేందుకు రంభాయ్ పటేల్‌కు డబ్బులు చెల్లించినట్లు అమెరికా ఫెడరల్ కోర్టు పేర్కొంది.

దాంతో అమెరికాలో వీసా మోసం చేసినందుకు ఈ భారతీయుడిని ఆ దేశం బహిష్కరించింది. వీసా నేరానికి పాల్పడటంతో అమెరికా ఫెడరల్ కోర్టు దేశ బహిష్కరణే కాకుండా తీవ్రమైన శిక్ష విధించింది. మసాచుసెట్స్‌లోని వోర్సెస్టర్‌కు చెందిన మిథిల్ పటేల్ వీసా నేరమే కాకుండా మరెన్నో నేరాలకు కూడా పాల్పడ్డాడని కోర్టు నిర్ధారించింది.

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం ఈ కుట్రలో మొత్తం 11 మంది పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి రంభాయ్ పటేల్, నకిలీ దొంగగా వ్యవహరించిన వ్యక్తి, అలాగే తప్పించుకునేందుకు వాహనం నడిపిన బల్విందర్ సింగ్‌లపై ఇప్పటికే కేసులు నమోదు అయ్యాయి. వీరిని 2025 మేలో కోర్టు దోషులుగా తేల్చింది. తాజాగా మిథిల్ పటేల్‌కు శిక్ష ఖరారు కావడంతో ఈ వీసా మోసం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధికారులు ఇటువంటి మోసాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

వీసా ప్రయోజనాలు పొందే కుట్రలో పాల్గొన్నట్లు అంగీకరిస్తూ మిథిల్ పటేల్ 2026 జూన్‌లో నేరాన్ని ఒప్పుకున్నాడు. దాంతో అమెరికా ఫెడరల్ కోర్టు ఒక రోజు జైలు శిక్ష, 1,000 అమెరికన్ డాలర్ల జరిమానా విధించడంతో పాటు దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.

ఈ పథకంలో “బాధితులుగా” నటించిన వారు రంభాయ్ పటేల్‌కు డబ్బులు చెల్లించగా, రంభాయ్ పటేల్ ఆయా దుకాణాల యజమానులకు స్టోర్లను ఉపయోగించేందుకు చెల్లింపులు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి.

Related posts

గాజాలో ఇజ్రాయెల్ చర్యలు యుద్ధ నేరాలే

Satyam News

ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ‘జ్ఞానోదయం’.!

Satyam News

విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ ప్రజాదర్బార్

Satyam News

‘హైడ్రా’ విలువ ఇప్పటికైనా తెలుసుకోండి

Satyam News

వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ఫినామినా..

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

Leave a Comment