క్రీడలుహోమ్

అర్జున అవార్డు గ్రహీత, ధనుష్ శ్రీకాంత్‌కు స్పోర్ట్స్ సన్మానం

#DhanushSrikanth

అర్జున అవార్డు గ్రహీత, తెలంగాణకు చెందిన ప్రముఖ షూటర్ ధనుష్ శ్రీకాంత్ ఎల్బీ స్టేడియంలోని స్పోర్ట్స్ అథారిటీ కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఏ. సోనీ బాలాదేవిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా డాక్టర్ ఏ. సోనీ బాలాదేవి ధనుష్ శ్రీకాంత్‌ను అభినందించి, షూటింగ్ క్రీడలో సాధించిన అద్భుత విజయానికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, దేశానికి మరింత పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

అనంతరం స్పోర్ట్స్ అథారిటీ అధికారులు ధనుష్ శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించి, షూటింగ్ క్రీడలో ఆయన సాధించిన విశిష్ట విజయాలను అభినందించారు. తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన ధనుష్ శ్రీకాంత్‌కు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అనిత  డిప్యూటీ డైరెక్టర్లు శ్రీనివాస్ రవితేజ రవీందర్, పి ఆర్ ఓ కాలేరు సురేష్ తదితరులు పాల్గొన్నారు

Related posts

నేటి నుంచి భారీగా పెరిగిన గ్యాస్ ధరలు

Satyam News

గృహ ప్రవేశం లో గుండె పోటు… సో.. శాడ్

Satyam News

అమరావతి అప్‌డేట్: విజయవాడలో కొత్త స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం

Satyam News

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

Satyam News

బ్రిటీష్ పాలకుల కన్నా ఘోరం ఈ వైసీపీ నేతలు

Satyam News

మెడికల్ విద్యార్థినులకు మెరుగైన వైద్య సేవలందించండి

Satyam News

Leave a Comment