26.1 C
Hyderabad
September 23, 2026
ముఖ్యంశాలుహోమ్

జూరాలకు నీటి విడుదలకు కర్ణాటక సీఎం సానుకూలం

#DKShivKumar

జూరాల ప్రాజెక్టుకు నీటి విడుదల, దక్షిణ తెలంగాణలో నెలకొన్న కరువు పరిస్థితుల నేపథ్యంలో నిన్న సాయంత్రం, ఇవాళ ఉదయం కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిసి పరిస్థితులను వివరించామని తెలంగాణ మంత్రులు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి  డీకే శివకుమార్‌తో జరిగిన సమావేశంలో ఎల్‌నినో ప్రభావం, జూరాల ప్రాజెక్టు వద్ద నీటి మట్టం, సాగునీటి కోసం ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించామని తెలిపారు. తెలంగాణ రైతుల పరిస్థితిని ముఖ్యమంత్రి సానుకూలంగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రతినిధుల విజ్ఞప్తిపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ వెంటనే ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఎన్. చలువరాయస్వామి, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. షాలిని రాజనీష్‌తో మాట్లాడి, తెలంగాణకు సహాయం చేయాలని, వీలైనంత త్వరగా నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.

కర్ణాటకలోనూ నీటి కొరత, ఇబ్బందులు ఉన్నప్పటికీ తెలంగాణ రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని 10 రోజుల పాటు వారాబంధీ విధానంలో నీటిని విడుదల చేస్తామని కర్ణాటక సీఎం హామీ ఇచ్చారని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి చలువరాయస్వామి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఎస్. బోస్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేషన్), సీఎం సలహాదారు, ఇతర అధికారులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 20న తెలంగాణ సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ డీకే శివకుమార్‌కు లేఖ రాశారని తెలిపారు. అనంతరం కర్ణాటక ప్రభుత్వంతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ జూరాలకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

జూరాలతో పాటు భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతుల సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని భరోసా ఇచ్చారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, సాగునీటి శాఖ అధికారులతో రేపు సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిలాసాగర్ ప్రాజెక్టుల నుంచి సాగు, తాగునీటి అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ఈ సమావేశంలో సమగ్రంగా చర్చిస్తామని తెలిపారు.

రైతుల ప్రయోజనాలను కాపాడటమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందుబాటులో ఉన్న నీటి వనరులను ప్రణాళికాబద్ధంగా వినియోగిస్తూ ఆయకట్టు రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related posts

వృద్ధి రేటు పెరుగుదలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Satyam News

విద్యుత్ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వం విఫలం

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

నిర్ణీత గడువులోగా సర్ ప్రక్రియ పూర్తి చేయాలి

Satyam News

వైసీపీ ఫేక్ ప్రచారానికి పీవీ సింధు చెక్….. మళ్లీ భూమిపూజపై క్లారిటీ.!

Satyam News

టెహ్రాన్ చమురు నిల్వలపై ఇజ్రాయిల్ దాడి

Satyam News

Leave a Comment