31.8 C
Hyderabad
September 27, 2026
ఖమ్మంహోమ్

పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తులకు మోక్షం

#Ponguleti

కొన్ని దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

గత ప్రభుత్వం 2016లోనే ULC కింద పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించేందుకు జీవో జారీ చేసినప్పటికీ, దానిని అమలు చేయకపోవడంతో వేలాది దరఖాస్తులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని  తెలిపారు.

ఫలితంగా ప్రజలు తమ భూములపై హక్కులు, లావాదేవీల విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు.

ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి సంకల్పానికి అనుగుణంగా సహచర క్యాబినెట్ మంత్రులతో చర్చించి 22ఏ  సమస్యలకు  ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరించే దిశగా ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు.

ULC పెండింగ్ దరఖాస్తులపై తాజా నిర్ణయం

తెలంగాణ పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం (ULC) కింద పాక్షికంగా క్రమబద్ధీకరించిన, క్రమబద్ధీకరించని కాలనీలకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి, అర్హత ఉన్న కేసులను నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించాలని  స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.  ఈ మేరకు  గతంలో  జారీ చేసిన GO నం.455, 456, 747, 92 కింద వచ్చిన పెండింగ్ ULC దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించే విధంగా ఆదివారం నాడు Memo.No.48062/ULC/A1/2026-1,  జారీ చేసినట్లు వెల్లడించారు.

అర్హత కలిగిన కేసుల్లో నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని ప్రక్రియలు పూర్తి చేసి క్రమబద్ధీకరణ చర్యలు  తక్షణం చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

2016లో జీవో.. అమలు మాత్రం శూన్యం

ULC సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వం 2016లో జీవో జారీ చేసినప్పటికీ, ఆ జీవోను  అమలు చేయకపోవడంతో  ఏళ్ల తరబడి దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయని అన్నారు.

ఈ నెల 16న శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెక్షన్ 22Aతో ముడిపడి ఉన్న 10–12 కీలక అంశాలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

ఇప్పటికే 22A సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం,  ఆ తర్వాత  జి.ఓ 118కు అనుగుణంగా మెమో జారీ, ఆ వెంటనే జి .ఓ 76కు అనుగుణంగా మెమో ఇవ్వడం జరిగిందన్నారు. 22 ఎ లో ఉన్నప్పటికీ GHMC, HMDA, DTCP, మున్సిపల్ అనుమతులు కలిగిన ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తూ ఉత్తరులు జారీ చేయడం జరిగిందన్నారు.  తాజాగా దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ULC దరఖాస్తుల పరిష్కారానికి స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చామన్నారు.  మిగిలిన అన్ని సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపిస్తామని తెలిపారు.

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

“దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సమస్యల నుంచి ప్రజలకు విముక్తి కల్పిస్తామని, వారికి ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి భూ సమస్యను పరిశీలించి, చట్టం, నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అన్నారు.

Related posts

IGGAARL ను సందర్శించిన జర్మన్ ఫెడరల్ ప్రభుత్వ అంబాసిడర్

Satyam News

నాదర్గుల్ చెరువు కబ్జా చేస్తుంటే హైడ్రా నిద్రపోతుందా?

Satyam News

అమెజాన్ ప్రైమ్‌లో ‘పోలీస్ కంప్లైంట్’ స్ట్రీమింగ్

Satyam News

బంగారం నిల్వలను భారత్ అమ్మేసిందా…?

Satyam News

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మేనకా గాంధీ

Satyam News

విశాఖ సాగరతీరంలో ఘనంగా హనుమాన్ శోభాయాత్ర

Satyam News

Leave a Comment