ప్రత్యేకంహోమ్

రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసు నుంచి విముక్తి

#RahulGandhi

ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో నిర్దోషిగా విడుదల అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌ కోర్టు ఈ మేరకు 2018 నాటి పరువు నష్టం కేసును కొట్టేసింది. 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బెంగళూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాపై రాహుల్‌ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది.

సుల్తాన్‌పూర్‌ జిల్లా సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్‌, బీజేపీ నాయకుడు విజయ్‌ మిశ్రా 2018 ఆగస్టు 4న రాహుల్‌ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల కేసుల విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది. సోమవారం అక్టోబర్‌ 26న ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు అదనపు సివిల్‌ జడ్జి శుభమ్‌ వర్మ తొలుత అక్టోబర్‌ 13వ తేదీని నిర్ణయించారు. అనంతరం తీర్పు తేదీని అక్టోబర్‌ 26కు మార్చారు. తాజాగా విచారణ పూర్తిచేసిన న్యాయస్థానం రాహుల్‌ గాంధీని నిర్దోషిగా ప్రకటించింది.

Related posts

122 ఏండ్ల తర్వాత తెరుచుకోనున్న ‘కోణార్క్‌’ గర్భ గుడి

Satyam News

అరకు లోయ లో కనిపించిన భూమి

Satyam News

ఇంద్రకీలాద్రిపై  సామూహిక అక్షరాభ్యాసాలకు సర్వం సిద్ధం

Satyam News

కాక్రోచ్ వీడియోలను వైరల్ చేసింది పాకిస్తాన్?

Satyam News

కోచింగ్ సెంటర్ లో మంటలు: 15 మంది విద్యార్ధుల సజీవ దహనం

Satyam News

రామ్‌గోపాల్ వర్మ అరెస్టు తప్పదా?

Satyam News

Leave a Comment