ప్రత్యేకంహోమ్

Bengaluru horror: ఏడుగురిని చంపేసిన క్యాబ్ డ్రైవర్

#crime

బెంగళూరులో దారుణం జరిగింది. ఒక క్యాబ్ డ్రైవర్ తన భార్య కుటుంబానికి చెందిన ఏడుగురిని పాశవికంగా హత్య చేశాడు. బెంగళూరులోని శ్రీరాంపురం ప్రాంతానికి చెందిన శేఖర్‌ సుమారు 20 ఏళ్ల క్రితం సునీత అనే మహిళను వివాహం చేసుకున్నాడు.

అయితే కొంతకాలంగా భార్య తన పుట్టింటికి వెళ్లడం, అక్కడి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండటంపై శేఖర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమెతో తరచూ గొడవపడేవాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ విభేదాలు తగ్గలేదు. తన భార్యకు ఆమె తల్లి, సోదరులు మద్దతుగా నిలవడాన్ని కూడా శేఖర్‌ సహించలేకపోయాడని, ఈ క్రమంలో వారందరినీ అంతమొందించాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

భాష్యం సర్కిల్‌ సమీపంలో 59వ క్రాస్‌లో ఉన్న తన నివాసంలో రెండు రోజుల వ్యవధిలో ఈ హత్యలకు పాల్పడ్డాడు. ముందుగా భార్య సునీతను రోలు రోకలితో దాడి చేసి హత్య చేసిన శేఖర్‌, ఆమె మృతదేహాన్ని బట్టలో చుట్టి నందికొండల ప్రాంతంలో పడేశాడు. ఆమె సెల్‌ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి, సునీత విహారయాత్రకు వెళ్లిందని ఇరుగుపొరుగు వారికి చెప్పి అనుమానం రాకుండా వ్యవహరించాడు.

మరుసటి రోజు తన బావమరిదులు శివకుమార్‌, శంకర్‌లను ఇంటికి విందు పేరుతో ఆహ్వానించి వారిని కూడా రోలు రోకలితో హత్య చేశాడు. అనంతరం శివకుమార్‌ భార్య దివ్య, శంకర్‌ భార్య నళిని, అత్త రూపవతి, శివకుమార్‌కు చెందిన ఏడేళ్ల కుమారుడు పునీత్‌ను కూడా హత్య చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.

హత్యల అనంతరం ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా రసాయనాలతో శుభ్రం చేశాడు. మృతదేహాలను కారులో వేర్వేరు ప్రాంతాలకు తరలించి పడేసినట్లు పోలీసులు గుర్తించారు. నందికొండలు, చిక్కబళ్లాపురం జిల్లా పరిసరాలతో పాటు తీర ప్రాంత కర్ణాటకలోని చార్మాడి ఘాట్‌ ప్రాంతంలో మృతదేహాలను పడేసినట్లు నిందితుడు తెలిపాడు.

అదృశ్యమైన వ్యక్తులపై నళిని తల్లి గురువారం శ్రీరాంపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ హత్యల విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అనుమానాల ఆధారంగా శేఖర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా వరుస హత్యల వ్యవహారం బయటపడినట్లు తెలుస్తోంది. మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారును, హత్యలకు ఉపయోగించిన రోలు రోకలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విస్తృతంగా గాలింపు చేపట్టి నందికొండల సమీపంలో బాలుడు పునీత్‌ మృతదేహాన్ని గుర్తించారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది.

కుటుంబ కలహాల కారణంగానే ఈ హత్యలకు పాల్పడినట్లు శేఖర్‌ పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఈ హత్యల్లో మరెవరైనా సహకరించారా? ముఖ్యంగా నిందితుడి కుమార్తె పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జనావాసాల మధ్య ఉన్న ఇంట్లో ఇంతటి ఘోరాలు జరిగినప్పటికీ స్థానికులకు ఎలా తెలియలేదనే అంశంపైనా విచారణ చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులో తీవ్ర సంచలనం సృష్టించింది.

Related posts

కార్తీకమాస ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Satyam News

ఉత్తర తెలంగాణ ను ముంచేసిన వాన

Satyam News

వారంలో పాస్ బుక్‌లు..రైతులకు చంద్రబాబు గుడ్‌న్యూస్

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

దేవదేవుడికి అపచారం చేశాం: రోజా, జోగి టాక్ లీక్

Satyam News

ప్రత్యేక ఓటరు సవరణ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Satyam News

Leave a Comment