ప్రత్యేకంహోమ్

సీఐఐ సదస్సులో లోకేష్‌ దూకుడు…. జాతీయ మీడియాలో కథనాలు

#LokeshNara

విశాఖ వేదికగా జరిగిన CII భాగస్వామ్య సదస్సులో ఏపీ మంత్రి నారా లోకేష్  స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సాధారణంగా జాతీయ మీడియా యాంకర్లు అడిగే ప్రశ్నలకు నేతలు తడబడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. రాష్ట్ర విద్యుత్ అవసరాలు, భవిష్యత్ ప్రణాళికలపై యాంకర్ అడిగిన ప్రశ్నలకు లోకేష్ ఎక్కడా తడబడకుండా, పక్కా గణాంకాలతో కూడిన ఆన్సర్స్‌ ఇవ్వడంతో జాతీయ మీడియా సైతం ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూలతలను, ప్రభుత్వ విధానాలను లోకేష్‌ వివరించిన తీరు చూస్తుంటే, ఏపీ ప్రగతిపై నేరుగా ప్రధాని మోదీకి, ఢిల్లీ పెద్దలకు సమగ్ర రిపోర్ట్ అందినట్లయిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ప్రతి అంశంపైనా పూర్తి క్లారిటీతో మాట్లాడిన లోకేష్, గడిచిన ఏడాది కాలంలోనే ఏపీలో కరెంటు వాడకం ఏకంగా 30 శాతం పెరిగిందని స్పష్టం చేశారు. భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లు ఇంకా పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభించకముందే ఈ స్థాయిలో డిమాండ్ పెరిగిందంటే, 2028 నాటికి రాష్ట్ర విద్యుత్ అవసరాలు కనీసం రెట్టింపు అవుతాయని ఆయన అంచనా వేశారు. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకోవడానికి బేస్‌లోడ్ పవర్ కోసం థర్మల్, గ్యాస్ వంటి సంప్రదాయ విద్యుత్ వనరులు తప్పనిసరి అని చెబుతూనే, మరోవైపు రాయలసీమలో పుష్కలంగా ఉన్న సోలార్, విండ్ ఎనర్జీతో పాటు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుత ప్రభుత్వ వేగాన్ని పోలుస్తూ లోకేష్ చెప్పిన లెక్కలు సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల కాలంలో సరైన పాలసీలు లేకపోవడం వల్ల ఏపీలో కేవలం 6 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ మాత్రమే అందుబాటులోకి వస్తే, తమ ప్రభుత్వం వచ్చిన ఒక్క ఏడాదిలోనే ఏకంగా 4.8 గిగావాట్ల విద్యుత్‌ను జత చేశామన్నారు. పగటిపూట సోలార్ కరెంటు 50 పైసలకే దొరికినా, రాత్రివేళల్లో యూనిట్ రూ.10 నుంచి రూ.30 వరకు వెళ్లే పరిస్థితి ఉందని, అందుకే 24 గంటల పాటు తక్కువ ధరకే గ్రీన్ ఎనర్జీని అందించేలా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను 5-7 ఏళ్లు కాకుండా, కేవలం రెండు మూడేళ్లలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

గత ఐదేళ్లలో పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నీ క్లియర్ చేసి  క్లీన్ స్లేట్‌తో ముందుకు వెళ్తున్నామని లోకేష్ పరిశ్రమలకు భరోసా ఇచ్చారు. మొత్తానికి, కేవలం మాటలతో కాకుండా కచ్చితమైన డేటా, భవిష్యత్ ప్రణాళికతో లోకేష్ ఇచ్చిన సమాధానాలు జాతీయ స్థాయి పారిశ్రామికవేత్తలను, మీడియాను కట్టిపడేశాయి. ఈ సదస్సు ద్వారా ఏపీలో జరుగుతున్న వేగవంతమైన మార్పులు నేరుగా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి వెళ్లడంతో, రాష్ట్రానికి రానున్న రోజుల్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు, కేంద్ర సహకారం అందడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related posts

న్యాయవాది నక్కా రమేష్ ఆకస్మిక మృతి

Satyam News

ఇండిగో అయినా ఎవరైనా ఊరుకోం

Satyam News

ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే కేన్సర్‌ ను అధిగమించవచ్చు

Satyam News

అమెరికా రాజీ యత్నాన్ని బూటకం అన్న ఇరాన్

Satyam News

చైనాతో సరిహద్దు సమస్యలపై చర్చలు షురూ

Satyam News

సీఎం సారూ…. నన్ను బతికించండి..: కీర్తన

Satyam News

Leave a Comment