26.7 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

వైసీపీ యానిమల్‌… ఈ పొలిటికల్‌ బాబీ డియోల్‌….!!

#VenkateshSharma

వైసీపీ నేతలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు, లీగల్ సెల్‌ అడ్వకేట్లు సైతం నేర ప్రవృత్తి కలిగిన వారే. తాజాగా వైసీపీ లీగల్‌ సెల్ అడ్వకేట్ వెంకటేశ్ శర్మపై మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ విడాకుల కేసు వాదించేందుకు వెంకటేశ్‌ను సంప్రదించగా ఆమెతో వెంకటనే అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో బాధితురాలు మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు.

బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. వెంకటేశ్ శర్మపై 75 (1)(i) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్ శర్మపై గతంలో వచ్చిన ఫిర్యాదులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. వెంకటేశ్ శర్మ మహిళలతో అసభ్యంగా ప్రవరిస్తునట్లు గుర్తించారు. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్ట్‌ చేసిన సంచలన మూవీ యానిమల్‌ సినిమా గుర్తుందా..?? ఆ మూవీలో విలన్‌ బాబీ డియోల్‌ తలపై గ్లాస్‌ పెట్టుకొని చేసిన డ్యాన్స్‌ స్టెప్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి.. విలన్‌ బాబీ డియోల్‌ని ఆదర్శంగా తీసుకున్న వైసీపీ లీల్‌ సెల్‌ సభ్యుడు వెంకటేశ్వర శర్మ ఓ వీడియో చేశారు.. తలపై గ్లాస్‌ ప్లేస్‌లో రూ. 500 నోట్ల కట్టలతో డ్యాన్స్‌ చేశారు.. హోటల్‌లో బెడ్‌ పై పడుకొని, ఒంటిపై కరెన్సీతో స్టెప్స్‌ వేశారు వెంకటేశ్వర శర్మ..

వెంకటేశ్ శర్మకు సంబంధించి పలు వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. వెంకటేశ్ క్లబ్బుల్లో మహిళలపై కరెన్సీ విసురుతూ ఉన్న వీడియోలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డబ్బు కట్టలతో బెడ్డుపై దొర్లుతూ ఉన్న మరో వీడియో సైతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోల గురించి సైతం ఆరా తీస్తున్నారు మాచవరం పోలీసులు. వెంకటేశ్ సంపాదన, ఆస్తులపై ఆరా తీస్తున్నారు.

Related posts

జగన్‌ని అవమానించిన  బొత్స సత్యనారాయణ

Satyam News

విజయసాయి రెడ్డి టార్గెట్ భారతీ రెడ్డా?

Satyam News

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

Satyam News

గ్రీన్ ఎనర్జీలో ఏపీ గర్జన…సౌత్‌ ఇండియా నంబర్ 1!

Satyam News

ఈనెల 23 నుండి శ్రీ శేషదాసుల 141 ఆరాధన ఉత్సవాలు

Satyam News

అంగరంగ వైభవంగా శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి కళ్యాణం

Satyam News

Leave a Comment