25.2 C
Hyderabad
September 20, 2026
కృష్ణహోమ్

హజ్ యాత్ర సౌకర్యాలపై సమీక్ష

#HazCommittee

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ విజయవాడ కార్యాలయంలో సోమవారం రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ జనాబ్ షేక్ హసన్ బాషా సలహా సూచనల మేరకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్  గౌస్ పీర్  ఆధ్వర్యంలో ఐదవ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో హజ్ కమిటీ డైరెక్టర్లు జనాబ్ మహబూబ్ బాషా, జనాబ్ మీరా సాహెబ్, జనాబ్ మీర్జా అబీద్ హుస్సేన్, జనాబ్ యన్. బాబా ఫక్రుద్దీన్, జనాబ్ పఠాన్ ఖాదర్ ఖాన్, సాహేబా ఎస్. రేష్మా పర్వీన్, జనాబ్ షేక్ అబ్దుల్ హుస్సేన్, జనాబా సూరి మన్సూర్ అలీ, జనాబ్ సయ్యద్ షాజి సుల్తాన్ ముసవి, సాహేబా షేక్ జబీన్  పాల్గొన్నారు. 2026 హజ్ యాత్రకు వెళ్లబోయే హాజీల కోసం మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఎలా చేయాలి, 2025 హజ్ సందర్భంగా హాజీలకు ఎదురైన అసౌకర్యాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు ఎలా తీసుకోవాలి, విజయవాడ ఎంబర్కేషన్ పాయింట్‌ను మరింత అభివృద్ధి చేయడం, ప్రతి హాజీకి ప్రభుత్వ సహకారం సకాలంలో అందేలా చర్యలు తీసుకోవడం వంటి ముఖ్య అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అదేవిధంగా విజయవాడ హజ్ హౌస్ స్థలం మరియు భవన నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వ సహకారాన్ని సాకారం చేసుకోవడంపై కూడా సమగ్ర సమీక్ష నిర్వహించారు. సమావేశంలో గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే జనాబ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు.

Related posts

సేవ్ ఎర్త్ ఫౌండేషన్ కు మదర్ ఇండియా జాతీయ అవార్డ్2026

Satyam News

చంద్రబాబుపై కేటీఆర్‌  ప్రశంసలు…. బీఆర్‌ఎస్‌ స్వరం మారిందా..?

Satyam News

సౌదీ ఆరామ్ కో రిఫైనరీని పేల్చేసిన ఇరాన్

Satyam News

డాక్టర్ ప్రియాంకపై దాడిని ఖండించిన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి

Satyam News

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

అంతులేని కథ కు 50 ఏళ్లు

Satyam News

Leave a Comment