25.2 C
Hyderabad
September 20, 2026
చిత్తూరుహోమ్

తిరుపతి సంస్కృత యూనివర్సిటీలో లైంగికదాడి?

#RapeVictim

తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో చోటుచేసుకున్న లైంగిక దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి ఆమె తిరుపతి ఎస్పీతో పాటు ఉన్నత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడినట్లు వెల్లడించారు. విద్యార్థి ఫిర్యాదును పోలీసులు వెంటనే స్వీకరించారని, ఎస్పీ స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ కోసం ఒడిశాకు కూడా ప్రత్యేక పోలీసు బృందాన్ని పంపినట్లు తెలిపారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయడం తమ కర్తవ్యమని, ఈ కేసులో ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. మహిళల భద్రత తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.

Related posts

విశాఖ ఇక ‘‘డిజిటల్ సిటీ’’

Satyam News

మన అవయవాలు కాపాడుకోవడం ఎలా?

Satyam News

లాటరీ ద్వారా బార్ల కేటాయింపు

Satyam News

భవిష్యత్తు కోసం ఎదురుచూడం… నిర్మిస్తాం

Satyam News

ఎర్ర చందనం స్మగ్లర్ల అరెస్టు

Satyam News

మరి కొన్ని రోజులు…. ఇలాగే…

Satyam News

Leave a Comment