26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవాలు నిషేధం

#SunithaReddyIPS

ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రత పరిరక్షణకు మూడు దశల పంచాయతీ ఎన్నికల పూర్తిస్థాయి ప్రక్రియ ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వనపర్తి జిల్లాలో అమల్లో కొనసాగుతుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి చెప్పారు. ఎన్నికల తొలి దశలో ఫలితాలు ప్రకటించినప్పటికీ, గెలిచిన అభ్యర్థులు లేదా వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు, భారీ సభలు, బైక్ ర్యాలీలు, శోభాయాత్రలు, డీజేలు వంటి కార్యక్రమాలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎంసీసీ అమల్లో ఉన్నంతకాలం ఈ ఆంక్షలను  పాటించాలని, నియమాలను అతిక్రమించే ఏ చర్యనైనా సహించం, ఉల్లంఘనలు జరిగితే వెంటనే  కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య ప్రక్రియ సజావుగా సాగాలంటే నిబంధనలు పాటించడం ప్రతి పౌరుడి బాధ్యత, శాంతియుత వాతావరణం నెలకొనడానికి ప్రజలు, నాయకులు, అభ్యర్థులు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

13 ఏళ్ల లోపు పిల్లలకు నో సోషల్ మీడియా

Satyam News

భార్య ఎక్కువ తింటున్నదని హత్య చేసిన భర్త

Satyam News

శోభాయాత్ర లో ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam News

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వాన

Satyam News

శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ఆల‌యంలో సంప్రోక్షణ

Satyam News

Leave a Comment