31.6 C
Hyderabad
September 21, 2026
కరీంనగర్హోమ్

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు

#BandiSainjai

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం 96 గదుల సత్రం నిర్మాణానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సిఫార్సుతో టీటీడీ ద్వారా రూ. 35.19 కోట్లు కేటాయించడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇది భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న కీలక నిర్ణయమని ఆయన పేర్కొన్నారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు ఆలయానికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి, నయాపైసా కూడా ఇవ్వకుండా భక్తులను మోసం చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. అదే విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొండగట్టు ఆలయానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడమే కాకుండా, ఆర్జిత సేవల చార్జీల పెంపు పేరుతో భక్తులపై అదనపు భారం మోపుతోందని విమర్శించారు.

భక్తులకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఆయన అన్నారు. అంజన్న ఆలయానికి సంబంధించిన వసతి సౌకర్యాల కోసం టీటీడీ రూ. 35 కోట్లకు పైగా నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు.

దేవాలయాలపై ప్రేమ చూపిస్తున్నట్లు మాట్లాడుతున్న కాంగ్రెస్ పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కొండగట్టు ఆలయానికి తగిన నిధులు కేటాయించి అన్ని విధాలా అభివృద్ధి చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

Related posts

భయం… భయంగా తిరుగుతున్న జగన్ బాబాయ్!

Satyam News

జిందాల్ ఎంఎస్ఎమ్ఈ పార్క్ వర్చువల్ ప్రారంభోత్సవానికి సిద్ధం

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

పైలెట్ కోసం వచ్చిన అమెరికా దళాలను తిప్పికొట్టిన ఇరాన్

Satyam News

చంద్రబాబు పుత్రోత్సాహం… లోకేష్‌ ఫుల్‌ ఖుషీ

Satyam News

హైడ్రా పెట్టి 2 ఏళ్లు.. కబ్జాల చెరవీడిన భూమి 3325 ఎకరాలు

Satyam News

Leave a Comment