25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

కోటప్పకొండ తిరునాళ్లకు రూ.30 లక్షలు మంజూరు

మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల నిర్వహణకు రూ.30 లక్షలు మంజూరు చేయనున్నామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఉదయం కోటప్పకొండ మహాశివరాత్రి వేడుకల నిర్వహణపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మూడవ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు చదలవాడ అరవింద బాబు, ప్రత్తిపాటి పుల్లారావు, జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొన్నారు.

సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వీఐపీ పాసుల విషయంలో గత అనుభవాల దృష్ట్యా వీఐపీ టికెట్లు మంజూరు చేయనున్నామన్నారు. వీఐపీ దర్శన టికెట్ల ఫిబ్రవరి 10 నుంచి 14 వరకూ ఆన్ లైన్ లో సైతం బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. వీఐపీలు వాళ్లకు ఇచ్చిన టైం స్లాట్ లో మాత్రమే దర్శనం చేసుకునేలా చూడాలన్నారు.

త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూ అందజేస్తామన్నారు. క్యూ లైన్లలో భక్తులు ఎక్కువగా వేచి చూడకుండా త్వరగా దైవ దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తులకు త్వరగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తకూడదని, లిఫ్ట్ సమస్యలు, ఇతర విద్యుత్ సమస్యలు తలెత్తితే పరిష్కరించేందుకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు.

జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా మాట్లాడుతూ గత సంవత్సరం శివరాత్రికి 550 బస్సులు నడిపామని, ఈ సంవత్సరం అంతకుమించి 618 బస్సులు కేటాయించామన్నారు. కేవలం కొండ మీద నుంచి కిందకు భక్తులను తరలించేందుకు 95 బస్సులు కేటాయించామన్నారు.

శివరాత్రికి రాత్రి పూట కొండపైన ఉండే భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రభల సమయంలో వెలుతురు నాణ్యత మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్. నెట్, నరసరావుపేట

Related posts

జనసేన పార్టీ పునర్నిర్మాణానికి కొత్త విధానం

Satyam News

కార్యకర్తలకు గుర్తింపునిచ్చే పార్టీ  టీడీపీ

Satyam News

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఆశీర్వదించాలి

Satyam News

ఏలూరుకు రిలయన్స్ రాక..రూ.2.73 లక్షల కోట్లతో అతిపెద్ద ప్రాజెక్ట్!

Satyam News

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన వనపర్తి ఎస్పీ

Satyam News

జగన్ గో బ్యాక్: దళితుల ఆందోళన తీవ్రరూపం

Satyam News

Leave a Comment