26.3 C
Hyderabad
September 19, 2026
మహబూబ్ నగర్హోమ్

గొడవలు అల్లర్లు చేస్తే, ర్యాలీ చేస్తే రిమాండ్

వనపర్తి జిల్లాలో గొడవలు అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిని రిమాండ్ లోకి తీసుకోవలసి ఉంటుందని వనపర్తి జిల్లా ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ర్యాలీలు లేదా ఊరేగింపులు నిర్వహించుటకు సంబంధిత అధికారుల ఉత్తర్వుల మేరకు నిర్దేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలని చెప్పారు.

ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే, లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వనపర్తి జిల్లా పరిధిలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు, మున్సిపాలిటిలలో కౌంటింగ్ కేంద్రాల దగ్గర 850 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో మూడంచల భారీ భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని, సంబంధిత అధికారులు నిర్దేశించే తేదీల్లో మాత్రమే విజయోత్సవాలు జరుపుకోవాలని, లెక్కింపు కేంద్రాల దగ్గర శాంతిభద్రతలు కాపాడేందుకు, ఎలాంటి అసాంఘిక చర్యలు చోటు చేసుకోకుండా చూసేందుకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

కౌంటింగ్ కేంద్రాల వెలుపల 163 బిఎన్ ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని,లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందోబస్తు, క్యూ.ఆర్.టి టీంలు, డాగ్ స్క్వాడ్ టీమ్స్, బాంబు డిస్పోసల్ టీమ్స్, స్ట్రైకింగ్ ఫోర్సులు సిద్ధంగా ఉంచామని అన్నారు.

ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయలు కాల్చటం, ఊరేగింపులకు ఎలాంటి అనుమతి లేదని తెలిపారు. ప్రజలు చట్టాన్ని గౌరవించి, శాంతి భద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రైతులపై కపట ప్రేమ ఆపి డీజిల్ రేట్లు తగ్గించండి

Satyam News

రాజంపేట టిడిపి బలోపేతానికి చర్యలు చేపట్టండి

Satyam News

దేవదేవుడి లడ్డూ కల్తీపై గర్జించిన స్వామీజీలు

Satyam News

అమర్‌నాథ్ యాత్రలో ప్రమాదం.. 39 మంది యాత్రికులకు గాయాలు

Satyam News

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News

క్లిష్ట సమయంలో కుటుంబం నుంచే మద్దతు రాలేదు

Satyam News

Leave a Comment