కృష్ణహోమ్

విజయవాడ లో 10 వేల సీసీ కెమెరాలు

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో సేవా కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. సురక్షా కమిటీ కన్వీనర్ కె.వి. నరసయ్య ఆధ్వర్యంలో, మెడ్ ప్లస్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేద మహిళలకు కుట్టు మిషన్లు, వృద్ధులకు టిఫిన్ బండ్లను నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర బాబు పంపిణీ చేశారు.

స్థానిక సిటీ ఏ.ఆర్. గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో భద్రతా సంస్కృతిని (Safety Culture) పెంపొందించడమే లక్ష్యంగా సురక్షా కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు.

ఈ కమిటీల సహకారంతో నగరవ్యాప్తంగా సుమారు 10,500 సి.సి. కెమెరాలను ఏర్పాటు చేయగలిగామని వివరించారు. కన్వీనర్ కె.వి. నరసయ్య నేతృత్వంలో మహిళా పోలీసులకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా డ్రోన్ల ద్వారా 70 వేల విత్తన బంతులను చల్లడం, టి.టి.డి. అన్నదానానికి కూరగాయలు పంపడం వంటి అనేక సేవా కార్యక్రమాలు జరగడం అభినందనీయమని కొనియాడారు.

నేడు 20 కుట్టు మిషన్లు, 6 టిఫిన్ బండ్లను అందజేసినందుకు నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అడ్మిన్ డి.సి.పి. కె.జి.వి. సరిత మాట్లాడుతూ, పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు మార్గదర్శకత్వంలో 10 వేల సి.సి. కెమెరాలు, 42 డ్రోన్లను ఏర్పాటు చేసి దేశంలోనే ఎన్.టి.ఆర్. కమిషనరేట్‌ను అగ్రస్థానంలో నిలిపారని పేర్కొన్నారు. “మీ రక్షణ మా బాధ్యత – మా రక్షణ మీ బాధ్యత” అనే నినాదంతో ప్రజలను భాగస్వాములను చేస్తూ సురక్షా కమిటీలు పనిచేస్తున్నాయని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్.ఏ.డి.సి.పి. కె. కోటేశ్వర రావు, ఏ.ఆర్.ఏ.సి.పి. ప్రేమ్ కుమార్, సురక్షా కమిటీ కన్వీనర్ కుదరవల్లి నరసయ్య, మెడ్ ప్లస్ ప్రతినిధులు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు

.

 

Related posts

షాబాద్‌లో ఆరు హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే

Satyam News

నిన్న లోకేష్.. నేడు బాలయ్య..  ప్రజాసేవలో మామా అల్లుళ్ల పోటీ

Satyam News

ఇరాన్ తో చర్చలకు పాక్ చేరుకున్న జేడీవాన్స్

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

తిరుమలలో నెయ్యి కల్తీతో లడ్డూ జిహాద్‌..?

Satyam News

‘అక్రమ నగదు’ వ్యవహారంలో న్యాయమూర్తి రాజీనామా

Satyam News

Leave a Comment