26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

ఇరాన్ పై దాడులు ప్రారంభించిన ఇజ్రాయిల్

#Tehran

అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ పై ప్రాణాంతక దాడులు ప్రారంభించాయి. శనివారం మధ్యాహ్న సమయంలో ఇరాన్ రాజధాని టెహరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేసింది. నగరం నడిబొడ్డున భారీ పొగ మేఘాలు ఎగసిపడుతున్నట్లు సమాచారం. తొలి దాడి అలీ ఖొమైనీ కార్యాలయ సమీపంలో జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ సైనిక స్థావరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, గూఢచారి విభాగాలకు సంబంధించిన లక్ష్యాలను టార్గెట్ చేసినట్లు ఆపరేషన్‌పై సమాచారం ఉన్న ఓ అధికారి వెల్లడించారు.

అయితే అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాల్ కట్జ్ ఈ దాడి “భయాలను తొలగించడానికి” చేపట్టిన చర్య అని పేర్కొన్నారు. అయితే దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేదు. టెహ్రాన్‌లో ఖమేనై కార్యాలయ సమీపంలో మొదటి పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ కూడా పేలుడు జరిగినట్టు ప్రసారం చేసింది, కానీ కారణంపై వివరాలు ఇవ్వలేదు.

అదే సమయంలో ఇజ్రాయెల్ అంతటా సైరన్లు మోగించబడ్డాయి. దేశం తన గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేసింది. ఇజ్రాయెల్ సైన్యం “ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడుల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు హెచ్చరిక జారీ చేసినట్లు” ప్రకటించింది.

Related posts

రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యం

Satyam News

ఆ ఒక్క కారణంతో.. కూటమిలో తిరుగులేని ఐక్యత

Satyam News

ఫైనల్ కు దూసుకెళ్లిన న్యూజిలాండ్

Satyam News

అప్ర‌మ‌త్తంగా ఉండాలి: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌

Satyam News

రేవంత్ రెడ్డిని పొగిడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Satyam News

అసోమ్ రాష్ట్రంలో ఇక ఉమ్మడి పౌరసత్వ బిల్లు

Satyam News

Leave a Comment