26.3 C
Hyderabad
September 19, 2026
చిత్తూరుహోమ్

టీటీడీ చైర్మన్ పై వైసీపీ డీప్ ఫేక్ ప్రచారం

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లక్ష్యంగా వైసీపీ సోషల్ మీడియా విభాగం డీప్ ఫేక్ సాంకేతికతతో అసభ్యకరమైన వీడియోలను సృష్టించి రాజకీయ వికృత క్రీడకు తెరలేపిందని పౌర సమాజం, నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో ఎదురవుతున్న ప్రజా ఆగ్రహం నుండి హిందువుల దృష్టిని మళ్లించేందుకే జగన్ రెడ్డి పర్యవేక్షణలో ఈ ‘డైవర్షన్ పాలిటిక్స్’ జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలోని సాంకేతిక లోపాలను నెటిజన్లు ఎండగడుతున్నారు.

ఎయిర్‌పోర్ట్ నుండి బయటకు వచ్చేటప్పుడు సదరు మహిళ కట్టుకున్న చీర రంగుకు, కారు ఎక్కేటప్పుడు ఉన్న రంగుకు పొంతన లేకపోవడం ఇది స్పష్టమైన మార్ఫింగ్ డీప్ ఫేక్ సృష్టేనని నిర్ధారిస్తోంది. ఇటువంటి నీచమైన కుట్రలకు పాల్పడటం వైసీపీ నైజానికి నిదర్శనమని, విదేశాల్లో ఉన్న ఫేక్ ఐడీల ద్వారా ఈ చెత్తను ప్రచారం చేయిస్తూ పేటీఎం బ్యాచ్‌తో లైకులు, షేర్లు కొట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

లడ్డూ అపవిత్రత వంటి మహాపాపం నుండి తప్పించుకోవడానికి ఇతరులపై బురద జల్లడం కోసమే ఇదంతా చేస్తున్నారని, అమాయక కార్యకర్తలను ఇటువంటి సైబర్ నేరాల్లోకి నెట్టి వారి జీవితాలను వైసీపీ నాయకత్వం బలి చేస్తోందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Related posts

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News

రాష్ట్రంలో ద‌శ‌ల వారీగా భూముల రీసర్వే

Satyam News

పొలిట్ బ్యూరో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు

Satyam News

ప్రియురాలిని కాల్చి చంపిన ఇద్దరు భార్యల మొగుడు

Satyam News

కాలభైరవునికి కలకండ, అటుకుల పాయసం నైవేద్యం

Satyam News

పెరిగిన ప్రీమియర్ పెట్రోలు ధరలు

Satyam News

Leave a Comment