26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోండి

స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని ఆవులు సత్రం ప్రక్కన ఉన్న కత్వ చెరువు డ్రైనేజీ కాలువలో పట్టపగలు ఆక్రమణదారులు యదేచ్ఛగా నిర్మాణాలు (పిల్లర్స్) చేస్తున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న నరసరావుపేట మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని పిడిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి. రామకృష్ణ, నాయకులు నల్లపాటి రామారావు ఆదివారం ఒక ప్రకటనలో జిల్లా ఉన్నత అధికారులను కోరారు.

రెండు రోజుల క్రితం ప్రజాసంఘాల నాయకులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని నరసరావుపేట తాహసిల్దార్ కి, మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి సాంబయ్యని కోరామన్నారు. ఐతే టీపీవో సాంబయ్య పనులు ఆపించామని తమకు చెప్పడం జరిగిందన్నారు. కానీ, ఇప్పటికీ యదేచ్చగా పట్టపగలు నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణదారులతో కుమ్మక్కైన సాంబయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

గోవా గవర్నర్ విజయనగరం రాక

Satyam News

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

Satyam News

సేవా తత్వాన్ని సహించలేనిది ప్రత్యర్థి పార్టీ నాయకులా?

Satyam News

అన్ని జిల్లాల్లో ఘనంగా విశ్వకర్మ జయంతి

Satyam News

రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే నా ఆశ

Satyam News

ఏపీలో సీ ఓటర్‌ లేటెస్ట్ సర్వే.. కళ్లు మూసుకుంటే.. గెలిచేస్తారు….!!

Satyam News

Leave a Comment