నెల్లూరు హోమ్

సంచలన విషయాలు బయటపెట్టనున్న లేడీ డాన్ అరుణ?

#NidiguntaAruna

లేడీ డాన్ నిడిగుంట అరుణను ఒంగోలు జైలు వద్ద కోర్ట్ అనుమతులతో కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఒంగోలు జైలు నుండి  కోవూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. అరుణ ను మూడు రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. ఉదయం 9 నుండి సాయంత్రం 6 వరకు  విచారణ కొనసాగనుంది.

విచారణ అనంతరం సాయంత్రం అరుణ ను నెల్లూరు సబ్ జైలుకు తరలిస్తారు. ఈ విచారణ లోనే అరుణ నుండి మరిన్ని విషయాలు రాబట్టడం తో పాటు ఆమె ఫోన్ లు కూడా ఓపెన్ చేసే అవకాశం ఉంది. దీంతో అరుణ ఫోన్ లో ఎలాంటి సమాచారం ఉంది ఆ సమాచారం బయట వస్తే ఎలాంటి  రహస్యాలు బయటకు వస్తాయి అనేది తీవ్ర ఉత్కంఠ  నెలకొంది.

ఇదే సమయంలో లేడీ డాన్ అరుణ తో సన్నిహితంగా వున్న అనేక మంది పెద్దలు గుండెల్లో గుబులు మొదలైంది. రాబోయే మూడు రోజులు కొందరికి అగ్నిపరీక్ష కానుంది.

Related posts

సినిమా షూటింగ్ లు మళ్లీ ప్రారంభం

Satyam News

ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలి

Satyam News

ఉత్తర తెలంగాణ ను ముంచేసిన వాన

Satyam News

Leave a Comment

error: Content is protected !!