26.7 C
Hyderabad
September 20, 2026
విజయనగరంహోమ్

విజ‌య‌న‌గ‌రం జిల్లా  పోలీస్ ఆఫీస్ లో ఓపెన్ హౌస్

#OpenHouse

విజ‌య‌న‌గ‌రం జిల్లా పోలీస్ కార్యాల‌యంలోమహిళా సాధికారత వారోత్సవాల్లో భాగంగా  “ఓపెన్ హౌస్” కార్య‌క్ర‌మాన్ని ఏఎస్పీ సౌమ్య‌ల‌త శుక్ర‌వారం ప్రారంభించారు. ఈ ఓపెన్ హౌస్ లో పోలీస్ శాఖ వినియోగిస్తున్న వెప‌న్స్ ,వాటి ఉప‌యోగం,ప‌నితీరును ప్ర‌ద‌ర్శించారు. గ‌న్‌మెన్ లు, వీవీపీఐల భ‌ద్ర‌త‌కై ఉప‌యోగించే వెప‌న్స్‌, సీఎం, మంత్రులు, గ‌వ‌ర్న‌ర్స్‌, కేంద్ర మంత్రుల ప‌ర్య‌ట‌న‌లు,మావోల అణిచివేత‌కు వాడే  స్ట‌న్ గ‌న్‌, ఏకే47,మిష‌న్ గ‌న్ ,పిస్టోల్‌,రైఫ‌ల్,వివిధ ఆయుధాలు, సాంకేతికత, కమ్యూనికేషను, డ్రోన్స్, బి.డి.టీమ్స్, బాడీ వోర్న్ కెమెరాలు , పోలీసుశాఖ వినియోగించే వెప‌న్స్‌ గురించి విద్యార్ధులకు వివ‌రించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మాట్లాడుతూ  జ‌రిగిన “ఓపెన్ హౌస్” లో విద్యార్ధులకు పోలీసుశాఖ వినియోగిస్తున్న వివిధ ఆయుధాలు, సాంకేతికత, కమ్యూనికేషను, డ్రోన్స్, బి.డి.టీమ్స్, బాడీ వోర్న్ కెమెరాలు గురించి విద్యార్థినులకు వివరించి, పోలీసుశాఖ పట్ల విద్యార్ధులను చైతన్యపర్చామన్నారు.

డీపీఓను సందర్శించేందుకు వ‌చ్చిన‌ పోలీసు సంక్షేమ ఆంగ్ల పాఠశాల, భాష్యం, శ్రీ చైతన్య, ఎస్.కే.డిగ్రీ కళాశాల విద్యార్ధినులతో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత మమేకమై ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డిఎస్పీ ఇ.కోటిరెడ్డి, ఎస్బి సీఐ ఎ.వి.లీలారావు, ఆర్ఐలు ఎన్.గోపాలనాయుడు, రమేష్, కమ్యూనికేషను సిఐ శ్రీకాంత్, ఆర్ఎస్ఐలు, విద్యార్ధులు, ఉపాధ్యాయులు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నాడా?

Satyam News

ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లించడం లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం

Satyam News

‘పోలీస్ కంప్లైంట్’ కన్నడ టీజర్ విడుదల!

Satyam News

ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగింపు

Satyam News

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

‘యమకింకరుడు’ ట్రైలర్‌ విడుదల చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు

Satyam News

Leave a Comment