జాతీయంహోమ్

భారత విమానయానంపై యుద్ధ ప్రభావం తీవ్రం

#Airport

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలోని అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్రంగా పడింది. అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి జరిపిన నేపధ్యంలో కొన్ని మధ్యప్రాచ్య దేశాల గగనతలం మూసివేయబడడంతో అనేక విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం భారతదేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో మొత్తం 140 కి పైగా అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి.

ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 39 బయలుదేరే విమానాలు, 34 చేరుకునే విమానాలు రద్దయ్యాయి. అలాగే కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 33 విమానాలు రద్దు కాగా, అందులో 15 బయలుదేరే, 18 చేరుకునే విమానాలు ఉన్నాయి. ఇక ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో 15 బయలుదేరే విమానాలు, 14 చేరుకునే విమానాలు రద్దయ్యాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 4 బయలుదేరే, 3 చేరుకునే విమానాలు కలిపి మొత్తం 7 విమానాలు రద్దయ్యాయని అధికారులు తెలిపారు.

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల కారణంగా మధ్యప్రాచ్యంలోని కొన్ని దేశాల గగనతలం మూసివేయడంతో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే కొన్ని ఎయిర్‌లైన్స్ పరిమిత స్థాయిలో సర్వీసులు ప్రారంభించాయి. ఆకాశ ఎయిర్  శుక్రవారం ముంబై–జెద్దా–ముంబై మార్గంలో విమానాన్ని నడపనున్నట్లు తెలిపింది. శనివారం ముంబై, అహ్మదాబాద్, కొచ్చి నగరాల నుంచి జెద్దాకు విమాన సర్వీసులు నిర్వహిస్తామని సోషల్ మీడియాలో వెల్లడించింది.

అదే సమయంలో స్పైస్ జెట్ యూఏఈలో చిక్కుకున్న ప్రయాణికులను స్వదేశానికి తీసుకురావడానికి 14 ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ప్రకటించింది. ఇదిలా ఉండగా, మధ్యప్రాచ్య పరిస్థితులను ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నట్లు పౌర విమాన యాన శాఖ తెలిపింది. గురువారం భారతీయ విమానయాన సంస్థలు నడపాల్సిన మొత్తం 281 విమానాలు రద్దు అయినట్లు పేర్కొంది.

Related posts

మూడవ రోజు కొనసాగుతున్న సప్తాహ భజన

Satyam News

కాబూల్ కాందహార్ పై పాకిస్తాన్ పాశవికదాడి

Satyam News

నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ కు నివాళి

Satyam News

కోస్తాలో వైసీపీ ఖాళీ..?? ఆ 5గురు మాజీ ఎమ్‌ఎల్‌ఏలు జంప్‌..??

Satyam News

పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక నేడు

Satyam News

రెండున్న‌ర ఏళ్లలో దాదాపు 40 శాతం రియ‌ల్ ఎస్టేట్ వృద్ది

Satyam News

Leave a Comment