25.2 C
Hyderabad
September 20, 2026
ప్రత్యేకంహోమ్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: ట్రంప్ హెచ్చరిక

#DonaldTrump

లొంగిపోతే తప్ప ఇరాన్ తో చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కఠినంగా హెచ్చరించారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు చేసిన ఈ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచేవిగా ఉన్నాయి. ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందం ఉండదని, “పూర్తి లొంగుబాటు” మాత్రమే తాము అంగీకరించగలమని ఆయన స్పష్టం చేశారు.

అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడి చేస్తూ పెరుగుతున్న ఘర్షణల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయకపోతే చర్చలకు అర్థం లేదని ట్రంప్ తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాలు అభివృద్ధి చేయకుండా పూర్తిగా వెనక్కి తగ్గాలి, అదే నిజమైన పరిష్కారమని ఆయన పేర్కొన్నారు.

అమెరికా గగనతల నియంత్రణ తమకు ఉందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకునే శక్తి అమెరికాకు ఉందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ నుంచి అమెరికా సైనికులు లేదా పౌరులపై దాడులు జరిగితే తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని కూడా ఆయన తెలిపారు. ఇక ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖొమైనీ అమెరికా డిమాండ్‌ను ఖండిస్తూ “ఇరాన్ ఎప్పటికీ లొంగదు” అని స్పష్టం చేశారు.

అమెరికా సైనిక జోక్యం జరిగితే దాని ఫలితాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. ఇదే సమయంలో అమెరికా కాంగ్రెస్‌లో కూడా ఈ యుద్ధంపై చర్చ కొనసాగుతోంది. అమెరికా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ట్రంప్ సైనిక చర్యలను ఆపేందుకు వచ్చిన తీర్మానం తృటిలో తిరస్కరించబడింది. దీంతో ట్రంప్ తీసుకుంటున్న చర్యలకు రిపబ్లికన్ సభ్యుల మద్దతు కొనసాగుతున్నట్లు సంకేతాలు లభించాయి.

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే వేల మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ రాజకీయాల్లో పెద్ద మార్పులకు దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే  ట్రంప్ “ఇరాన్ పూర్తి లొంగుబాటు తప్ప మరో ఒప్పందం లేదు” అని ప్రకటించడం వల్ల అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.

Related posts

బోనాలు.. తెలంగాణ జీవనస్రవంతికి సాంస్కృతిక సాక్ష్యం

Satyam News

అమెరికా ఆయిల్ టాంకర్ పై ఇరాన్ దాడి?

Satyam News

వివేకా హత్య కేసు: సీబీఐ ఎదుట ప్రశ్నలు

Satyam News

ఇరాన్‌లో సైన్యం గుప్పిట్లోకి పాలనా పగ్గాలు!

Satyam News

సెమీ ఫైనల్ కు దూసుకు వెళ్లిన టీమిండియా

Satyam News

కామెడీ పేరుతో వికలాంగుల్ని అవమానపరిచిన యూట్యూబర్లు

Satyam News

Leave a Comment