మెదక్హోమ్

సిద్దిపేటలో హరీష్ రావు ఇఫ్తార్ విందు

#Harishrao

రంజాన్ పవిత్ర ఉపవాసాల సందర్భంగా సిద్దిపేటలో ఘనంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ మంత్రి టీ హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట అభివృద్ధి విషయంలో ముస్లిం సమాజానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో షాదీఖానా ఎక్కడైనా ఉందా అంటే సిద్దిపేటలో ఉందని, హైదరాబాద్ తర్వాత ఇక్బాల్ మినార్ కూడా సిద్దిపేటలోనే నిర్మించామని పేర్కొన్నారు.

ముస్లిం సమాజానికి సంబంధించిన పలు కార్యక్రమాలు సిద్దిపేట నుంచే ప్రారంభమయ్యాయని ఆయన తెలిపారు. చివరి సఫర్‌కు గాడీ దేశంలోనే మొదటిగా సిద్దిపేటలో ప్రారంభించామని చెప్పారు. అలాగే హైదరాబాద్ తర్వాత హజ్ హౌస్ కూడా సిద్దిపేటలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

సిద్దిపేటలో ముస్లిం సోదరులకు 700 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించినట్లు హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటను గర్వంగా చెప్పుకునే విధంగా అభివృద్ధి చేసుకున్నామని, ప్రజల ఆశీస్సులతో ఈ అభివృద్ధిని ఇంకా కొనసాగిస్తామని అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు రంజాన్ సమయం వస్తే విద్యుత్ సరఫరా నిలిపివేయకుండా ఉండేందుకు ప్రత్యేక సమీక్షలు నిర్వహించాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి సమస్యలు లేకుండా నీళ్లు, విద్యుత్, గ్యాస్ వంటి అవసరాలన్నీ సమృద్ధిగా అందుతున్నాయని చెప్పారు.

రంజాన్ సందర్భంగా ఇచ్చే రంజాన్ తోఫా పథకం తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడా లేదని హరీష్ రావు పేర్కొన్నారు. అలాగే ఇమామ్‌లు, మొజామ్‌లకు జీతాలు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇఫ్తార్ విందులు నిర్వహించే సంప్రదాయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తరఫున మొదటిసారిగా రంజాన్ ఇఫ్తార్ కార్యక్రమం సిద్దిపేటలోనే ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు. అల్లాహ్ దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే ప్రతి సంవత్సరం తన స్వంత ఖర్చుతో నిరుపేద ముస్లింలను ఉమ్రా యాత్రకు పంపిస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అమెరికాకు హెచ్చరికలు జారీ చేసిన ఇరాన్

Satyam News

మోసం చేసిన వైసీపీ నేత ఇల్లు ముట్టడి

Satyam News

వైద్య హబ్‌గా తెలంగాణ : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

Satyam News

శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2న

Satyam News

నరసరావుపేటలో “ఆవో ఉర్దూ సీఖే “

Satyam News

గణనీయంగా తగ్గిన దుబాయ్ ప్రయాణీకుల సంఖ్య

Satyam News

Leave a Comment