26.3 C
Hyderabad
September 19, 2026
హైదరాబాద్హోమ్

ఘనంగా కవిత జన్మదిన వేడుకలు

#KalvakuntlaKavitha

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు ఆమెకు వేద అశీర్వచనం అందజేసి దీర్ఘాయుష్షు, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు.

కార్యక్రమంలో భాగంగా వేద మంత్రోచ్చారణల మధ్య పండితులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి, కవితకి ఆశీర్వాదాలు అందించారు. అనంతరం కవిత వేద పండితుల పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాన్ని స్వీకరించారు. దేశం, రాష్ట్రం శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేయడం జరిగిందని పండితులు తెలిపారు. అలాగే కవిత జన్మదినం సందర్భంగా బంజారా పీఠాధిపతులు కూడా ఆమెను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సమాజ సేవలో ఆమె చేస్తున్న కృషి అభినందనీయం అని పేర్కొంటూ, భవిష్యత్తులో కూడా ప్రజలకు సేవ చేయాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి కార్యకర్తలు, అభిమానులు, పలువురు సామాజిక వర్గాల ప్రతినిధులు పాల్గొని కవితకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కవిత అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, సమాజ సేవలో మరింతగా కృషి చేస్తానని తెలిపారు.

Related posts

జూలై నెలలో శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Satyam News

సీఎం రేవంత్ కు నర్సస్ అసోసియేషన్ కృతజ్ఞతలు

Satyam News

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News

ఏపీలో భారీగా పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

Satyam News

నారా దేవాన్ష్ యూట్యూబ్ చాన‌ల్ Dino Deets ప్రారంభం

Satyam News

Pirates: రెండు భారతీయ నౌకల హైజాక్

Satyam News

Leave a Comment