26.3 C
Hyderabad
September 19, 2026
సినిమాహోమ్

త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న అనుష్క

సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పర్సనల్ లైఫ్ గురించి గత కొన్నేళ్లుగా రకరకాల రూమర్లు వస్తూనే ఉంటున్నాయి. ఇటీవల మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, ఘాటీ చిత్రాల్లో నటించారు. అలాగే మలయాళంలో కథనార్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇంకా కొన్ని సినిమాల కథలు చర్చల దశలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే అనుష్క కానీ తనపై వస్తున్న వార్తల పట్ల ఇంత వరకు ఎప్పుడూ స్పందించలేదు. అయితే కొద్దికాలంగా మీడియాకు, ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న స్వీటి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియా కోడై కూస్తుంది.

అయితే అనుష్క తన సహచర నటుడు, పాన్ ఇండియా స్టార్‌ హీరోతో ప్రేమలో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై సదరు హీరోగానీ.. అనుష్క ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఆ హీరో ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉండడం.. పెళ్లి గురించి పెద్దగా పట్టించుకోకపోవడం పట్ల అనుష్క కుటుంబ సభ్యులు మండిపడుతున్నారని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇక ఫ్యామిలీ ఒత్తిడి కారణంగా ఈ ఏడాదిలో అనుష్క పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. తన ఫ్యామిలీలోనే దగ్గర రిలేషన్ వ్యక్తితో పెళ్లి జరగనుందని అనుకుంటున్నారు.

అంతే కాకుండా అనుష్క వివాహం చేసుకోబోతున్న బిజినెస్ మ్యాన్‌ అని అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత? అనేది తేలాలంటే అనుష్క తరపు నుంచి ఏదైనా స్పందన వస్తే తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు.

Related posts

గుడివాడలో వేడెక్కిన రాజకీయం

Satyam News

మన దేశంలో ఉద్యోగాల పరిస్థితి బాగానే ఉంది….

Satyam News

వెలిగొండతో రూపురేఖలు మారనున్న మార్కాపురం

Satyam News

జగన్‌, భారతి డ్రీమ్‌ ప్యాలెస్‌ గేట్లు ఓపెన్….

Satyam News

బుడ్డాయిపల్లి లో దళితబంధు వాహనాలతో భారీ ర్యాలీ

Satyam News

నరసరావుపేటలో అత్యంత భక్తిశ్రద్ధలతో మొహరం

Satyam News

Leave a Comment